iDreamPost

సీఎం జగన్ ఆదర్శంగా.. మహారాష్ట్రలో లక్ష మొక్కలు నాటే ప్రోగ్రామ్!

సీఎం జగన్ ఆదర్శంగా.. మహారాష్ట్రలో లక్ష మొక్కలు నాటే ప్రోగ్రామ్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. సినిమా హీరోలకు ఉన్న స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే సీఎం జగన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయను వ్యక్తిగతంగా అభిమానించే వారు కొందరైతే.. ఆయన పరిపాలనను చూసి ఫిదా అయినా వారు  మరికొందరు. ఇక సీఎం జగన్ కి  కేవలం ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన పరిపాలను  చూసి.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలానే సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను కూడా ఆచరిస్తున్నారు. ఇక తాజాగా మహారాష్ట్ర వాసులు సీఎం జగన్ ను స్ఫూర్తిగా తీసుకుని లక్ష 11 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మహారాష్ట్రలోని షోలాపూర్ వాసులు ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. ఈ వానాకాలంలో భారీగా మొక్కలు  నాటే కార్యక్రమానికి మన సీఎం పేరును పెట్టుకున్నారు.  సీఎం జగన్ పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున పోలాపూర్  జిల్లాలోని 11 రెవెన్యూ డివిజన్లలోని  అన్ని గ్రామాల్లో, స్కూల్స్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్సిజన్ పార్క్  ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు. షోలాపూర్ ప్రాంతానికి చెందిన రైతు కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే.  ఇటీవలే సూర్యతాపాన్ని కూడా లెక్క చేయకుండా.. షోలాపూర్ నుంచి విజయవాడ మీదుగా తాడేపల్లి వరకు సైకిల్ పై వెళ్లి.. మరీ సీఎం జగన్ ను కలుసుకున్నారు. అదే అభిమానంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఒక మంచి పని చేయడానికి పరిధి ఏముంటుంది?. సమాజానికి హితం చేసే పనులు ఎవరు చేపట్టినా సంతోషమే.. ఇది లక్ష్మణ్ కాక్డే ఆలోచన.  తన అభిమాన నాయకుడు సీఎం జగన్ కోసం.. వైఎస్సార్ జయంతి సందర్భంగా సమాజానికి తనవంతుగా మేలు చేయాలని భావించి.. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షోలాపూర్ జిల్లాలోని దాదాపు 4800 పాఠశాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా లక్ష 11వేల 111 మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి బాలాజీ మంజులే ప్రారంభించారు.  లక్ష్మణ్ కాక్డే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. మరి.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని, పొరుగు రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి