iDreamPost

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు!

వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ.. దళారుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఇక తీరనున్నాయి. షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు చేసేలా రవాణా శాఖ ప్లాన్ చేస్తోంది.

వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ.. దళారుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఇక తీరనున్నాయి. షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు చేసేలా రవాణా శాఖ ప్లాన్ చేస్తోంది.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు!

కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇక మీ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కష్టాలు తీరనున్నాయి. తెలంగాణలో వెహికిల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు రవాణా శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటి దాక కొత్తగా వాహనం కొంటే దాని రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆ తిప్పలు తప్పనుంది. వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ రెడీ అవుతోంది. దీన్ని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది.

ఇప్పటి వరకు కొత్తగా వాహనం కొంటే షోరూంలలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్‌) చేస్తున్నారు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్‌ పత్రాలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా షోరూంలకే బదిలీ చేసేందుకు రవాణా శాఖ ప్లాన్ చేస్తోంది. మరికొన్ని నెలల్లోనే షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కు అవసరమయ్యే టెక్నాలజీ ఇంకా ఇతర అంశాలపై దృష్టిసారించింది రవాణా శాఖ.

హైదరాబాద్ నగరంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిల్లో టూవీలర్స్, కార్లు, ఇతర వాహనాలు ఉండగా.. టూ వీలర్ వెహికిల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాహనదారులతో కిక్కిరిసిపోతుంటాయి. ఈ రద్దీని తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు రవాణా శాఖ షోరూంలలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. రవాణా శాఖ నిర్ణయంతో ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల దందాకు రెడ్ సిగ్నల్ పడనుంది. కాగా వాహనాల రిజిస్ట్రేషన్లను షోరూంలలోనే చేసేలా కేంద్రం ప్రభుత్వం 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఈ విధానం పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి