iDreamPost

రైల్వే ప్రయాణికులకు గుడ్ ​న్యూస్.. టికెట్ ధరలు భారీగా తగ్గింపు!

  • Author singhj Published - 05:51 PM, Sat - 8 July 23
  • Author singhj Published - 05:51 PM, Sat - 8 July 23
రైల్వే ప్రయాణికులకు గుడ్ ​న్యూస్.. టికెట్ ధరలు భారీగా తగ్గింపు!

రైలు ప్రయాణం రానురాను ప్రియంగా మారుతోంది. పెరుగుతున్న టికెట్ ధరలు ట్రైన్ ప్యాసింజర్స్​ను భయపెడుతున్నాయి. చాలా రైళ్లలో స్లీపర్ క్లాసుల బోగీలను కుదించి.. ఏసీ క్లాస్ బోగీలను పెంచుతున్నారు. ఏసీ క్లాసులో ప్రయాణించాలంటే ధరలు ఏ రేంజ్​లో ఉంటాయో తెలిసిందే. దీంతో రైళ్లలో ప్రయాణించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ ఛైర్​కార్​తో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు కలిగిన రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది. వందేభారత్​తో పాటు అనుభూతి, విస్టాడోమ్​ కోచ్​లు కలిగిన అన్ని ట్రైన్స్​కూ ఇది వర్తిస్తుంది.

రైళ్లలో ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ట్రైన్స్​లో ఆక్యుపెన్సీని పెంచాలనే ఉద్దేశంతోనే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై టికెట్ రేట్లను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్​ కమర్షియల్ మేనేజర్​కు కట్టబెట్టింది. ఇక, దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్న విషయం విదితమే. అయితే ఈ రైళ్లకు కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. ఎండలు తగ్గి వర్షాలు పడుతుండటంతో ఏసీ బోగీల్లో.. ముఖ్యంగా ఛైర్​ కార్​ల్లో ప్రయాణానికి ఆశించిన మేర ప్యాసింజర్ల నుంచి డిమాండ్ ఉండట్లేదని సమాచారం.

ఆక్యుపెన్సీ తగ్గడంతో పాటు ఏసీ బోగీలకు ప్రయాణికుల నుంచి అంతగా డిమాండ్ రాకపోవడంతో రైల్వే బోర్డు ఈ కొత్త స్కీమ్​తో ముందుకొచ్చింది. బేసిక్ ఫేర్​లో గరిష్ఠంగా 25 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. దీనికి రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్​ఛార్జి, జీఎస్టీ లాంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణనలోకి తీసుకొని ఆయా ట్రైన్స్, రూట్స్​లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్​ను ప్రకటిస్తారు. ఈ డిస్కౌంట్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. అలాగే హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్​కు ఈ స్కీమ్ వర్తించదని పేర్కొంది. ఇక, ఇండియన్ రైల్వేస్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీల్లో ప్రయాణించే సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి