iDreamPost

sarkaru vaari paata సర్కారు ముందు సవాళ్లు ఎన్నో

sarkaru vaari paata సర్కారు ముందు సవాళ్లు ఎన్నో

మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట ఇంకో రెండు వారాల్లో వచ్చేస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రి ప్రమోషన్ వేగాన్ని పెంచింది. ట్రైలర్ ని ఇంకో వారం రోజుల్లోపే వదిలేస్తారు. ప్రీ రిలీజ్ ఎక్కడ ఎప్పుడు తదితర వివరాలు మహేష్ విదేశాల నుంచి తిరిగి రాగానే క్లారిటీ ఇచ్చేస్తారు. ఓవర్సీస్ లో ఒకటి రెండు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ 50 రోజుల ఒప్పందం, ఆచార్య రన్నింగ్, తగ్గని కెజిఎఫ్ 2 దూకుడు, 6న చిన్న సినిమాల రిలీజులు తదితర కారణాలు థియేటర్ల విషయంలో ఇబ్బంది పెట్టేలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మహేష్ అడ్డాగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎంలో ఈసారి సర్కారు వారి పాట విడుదల కావడం లేదు. కారణం ట్రిపులార్ ఫిఫ్టీ డేస్ కి కమిట్ మెంట్ జరిగిపోవడం. ఇది కొన్ని ప్రధాన సెంటర్స్ లో కామన్ గా ఉన్న సమస్య. ఇదంతా కాసేపు పక్కనపెడితే ఆచార్య ఫలితం సర్కారుకి చాలా కీలకం. ఎలా అంటారా. కరోనా పూర్తిగా సమిసిపోయాక థియేట్రికల్ గా అద్భుతాలు చేసింది విజువల్ గ్రాండియర్స్ మాత్రమే. స్టార్ హీరోలు చేసిన రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు వంద కోట్లను టచ్ చేయలేదు. బంగార్రాజు వల్ల కాలేదు. భీమ్లా నాయక్ తొంభైలోనే చేతులెత్తేశాడు. సో ఆచార్య హండ్రెడ్ క్రోర్ మార్కును అందుకుంటుందా లేదా అనేది కీలకం.

పుష్ప 1 సాధించింది కానీ దానికి హిందీ వెర్షన్ చాలా అడ్వాంటేజ్ అయ్యింది. కానీ సర్కారు వారి పాట కేవలం తెలుగులోనే వస్తోంది. తమిళ డబ్బింగ్ అన్నారు కానీ అది కూడా జరగనట్టే. ఫ్యాన్స్ ప్యాన్ ఇండియా రిలీజ్ కోరుకున్నారు కానీ అలా చేయాలన్నా ప్రస్తుతానికి అంత టైం చేతిలో లేదు ఆచార్య కనక వంద కోట్లు దాటితే సర్కారు ఈజీగా నూటా యాభై కోట్లను అందుకుంటుందని నమ్మకంగా చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ ఫలితం పట్ల ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. అఖండ అంత గొప్పగా ఆడితేనే సెంచరీ షేర్ సాధ్యపడలేదు. మరి థియేటర్లకు వచ్చే జనాల మైండ్ సెట్ మారిన తరుణంలో రాబోయే నెలలు చాలా కీలకంగా మారబోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి