iDreamPost

విషాదం.. SI ఈవెంట్స్‌లో కుప్పకూలిన యువకుడు

విషాదం.. SI ఈవెంట్స్‌లో కుప్పకూలిన యువకుడు

చిన్నప్పటి నుండి పోలీసు కావాలని కలగన్న యువకుడు.. ఆ కల తీరకుండానే కన్నుమూశాడు. తాను అనుకున్న ఉద్యోగం సాధించి, తల్లికి అండగా నిలుద్దామనుకున్నాడు.. కానీ తల్లిని, కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచి అనంత లోకాలకు తరలి వెళ్లిపోయాడు. ఏ ఉద్యోగమైతే సాధించాలనుకున్నాడో.. దానికి సంబంధించిన పరుగు పందెం పోటీలో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు మోహన్ కుమార్. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలానికి చెందిన మోహన్..బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం వట్టిచెరుకూరు మండలంలోని యామర్రు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి చిన్నప్పటి నుండి పోలీస్ కావాలన్నది కల. ఆ కల నేరవేర్చుకునేందుకు ఇటీవల ఎస్సై రాత పరీక్షలు రాశాడు. శుక్రవారం ఫిజికల్ టెస్ట్ ఉండగా.. అభ్యర్థులకు రన్నింగ్ చేపట్టారు.

రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మోహన్. వెంటనే పోలీసులు అతడికి సీఆర్పీ చేసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుమారుడు లేడన్న మరణవార్తతో తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంది. మోహన్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, తండ్రి చనిపోవడంతో తల్లి, చెల్లి బాధ్యతలు తనవేనని, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని చెప్పేవాడని పేర్కొన్నారు. బ్యాంకు, ఇతర పోటీ పరీక్షలు రాస్తూ ఉండేవాడని తెలిపారు. ఎస్సై ఫిజికల్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవాడని, వాకింగ్, జాగింగ్ చేసేవాడిని, కానీ అతడిని దురదృష్టం వెంటాడిందని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి