iDreamPost

పరిచయం కాస్త ప్రేమగా మారింది.. చివరకు పెళ్లి వరకు వెళ్లినా..!

పరిచయం కాస్త ప్రేమగా మారింది.. చివరకు పెళ్లి వరకు వెళ్లినా..!

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతుల్లో ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పశువులను కాచే రైతుల నుంచి మొదలుకుని సాఫ్ట్ వేర్  ఉద్యోగుల వరకు అందరి చేతులో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ల ఎప్పటి సమాచారం అప్పుడు తెలిసిపోతుంది. కానీ, అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయనుకోండి. ఇక నేటి కాలం యువత వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, కొత్తగా వచ్చిన థ్రెడ్స్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్ లను ఓపెన్ చేస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా వాడేస్తున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. ఇదే వేదికగా కొందరు కేటుగాళ్లు ప్రేమ, గీమా అంటూ అమాయక యువతులను మోసం చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించాడు. ఇక చివరికి పెళ్లి మాట ఎత్తేసరికి కట్నం డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చేవూరుపాలెం గ్రామంలో శొంఠి నాగదుర్గ (19 అనే యువతి నివాసం ఉంటుంది. అయితే, ఈ అమ్మాయికి గతంలో ఇన్ స్టా గ్రామ్ లో కష్టా జిల్లా గామంపాడుకు చెందిన శివనాగరాజు అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కొన్నాళ్ల పాటు చాటింగ్ చేసుకున్నారు. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. దీంతో అప్పటి నుంచి ఆ యువతి అతడిని ఎంతో పిచ్చిగా ప్రేమించింది. అలా వీరి ప్రేమాయణం  కొన్ని నెలలు గడిచింది.

ఇదిలా ఉంటే.. నాగదుర్గ ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో అతడు కూడా సరే అన్నాడు. కానీ, ఓ కండిషన్ పెట్టాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలని, అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ తెలిపాడు. ప్రియుడి మాటలు విన్న ఆ యువతి ఒక్కసారిగా షాక్ గురైంది. నాగదుర్గకు ఏం చేయాలో తెలియక  ప్రియుడి మాటలను తలుచుకుంటూ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇాక చేసేదేం లేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూడా చదవండి: నలుగురిలో ప్రియురాలి పరువు తీసిన ప్రియుడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి