iDreamPost

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడంతో వాహనదారులు ఆ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఎస్సై మాత్రం తన పాడు బుద్ది ప్రదర్శించి.. వార్తల్లో నిలిచాడు.

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడంతో వాహనదారులు ఆ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఎస్సై మాత్రం తన పాడు బుద్ది ప్రదర్శించి.. వార్తల్లో నిలిచాడు.

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై

తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ చలానాలపై పోలీసులు రాయితీ ప్రకటించడంతో అనూహ్య స్పందన వస్తోంది. డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో ఉన్న చలానాలపై రాయితీ ప్రకటించింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోపర్చుకుంటున్నారు వాహనాదారులు. పోలీసుల రికార్డుల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఈ రాయితీ ప్రకటించిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు సైతం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ… వాహనదారుల నుండి పెండింగ్ చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు గత నెల 26 నుంచి ఇప్పటి వరకు సుమారు 70 కోట్ల చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదే తమకు సదావకాశమని వాహనదారులు చలాన్లు కడుతుంటే.. ఇదే తనకు సానుకూల సమయని భావించిన ఓ ట్రాఫిక్ పోలీసు మాత్రం చేతి వాటం చూపించి.. అడ్డంగా దొరికిపోయాడు. అతడు లంచం తీసుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఈ ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది. హన్మకొండలో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న డేవిడ్.. ములుగు రోడ్ వద్ద విధులు నిర్వరిస్తున్నాడు. ఈ క్రమంలో అదే రోడ్డులో ఇద్దరు యువకులు వెళుతుండగా.. కానిస్టేబుల్ వారిని ఆపి డ్రైవింగ్ లైసెన్స్ అడగ్గా.. లేదని చెప్పారు. దీంతో వారిద్దరినీ ఎస్సై డేవిడ్ వద్దకు తీసుకు వచ్చాడు కానిస్టేబుల్.

అయితే వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్సై.. కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. వాహనదారుల నుండి లంచం డిమాండ్ చేస్తుండగా.. అక్కడే ఓ మేడపై నుండి ఓ వ్యక్తి ఈ వ్యవహారాన్నంతా తన మొబైల్‌ల్లో చిత్రీకరించాడు. ఈ వీడియోను సిటీ పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో ఎస్సై డేవిడ్‌‎ను సస్పెండ్ చేస్తూ వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లంచాల వ్యవహారంలో ఎస్సైకి సహరించిన కానిస్టేబుల్స్ పై కూడా విచారణ చేపట్టారు. ఓ వైపు ట్రాఫిక్ చలానాల కోసం బాధితులు బారులు తీరుతుంటే.. మరోవైపు ఇలాంటి ఎస్సై అమ్యామ్యాలకు కక్కుర్తి పడుతూ.. సస్పెండ్ అయ్యాడు. మరీ ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి