iDreamPost

Janasena: నోటాతో పోటీ పడుతున్న జనసేన! మరీ ఇన్ని తక్కువ ఓట్లా?

  • Published Dec 03, 2023 | 12:35 PMUpdated Dec 03, 2023 | 3:27 PM

Janasena, TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు దూసుకెళ్తుంటే.. జనసేన అభ్యర్థులు మాత్రం నోటాతో పోటీ పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎమ్మెల్యేగా అనర్హులన్ని చెప్తు వేసే ఓటే నోటా. ఇలా.. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో నోటాకు జనసేనకు మధ్య గట్టి పోటీ జరుగుతోంది. కొన్ని స్థానాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వస్తే.. మరికొన్ని స్థానాల్లో కొంచె ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరి కౌంటింగ్‌ పూర్తి అయ్యాక.. నోటా గెలుస్తుందా? జనసేన గెలుస్తుందా? అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది.

ఖమ్మం, అశ్వారరావుపేట, వైరా, కూకట్‌పల్లి, నాగర్‌కర్నూల్‌, శేరలింగంపల్లి, కొత్తగూడెం, కోదాడ ఈ 8 స్థానాల్లో జనసేన బీజేపీ మద్దతుతో పోటీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌ చూసుకుంటే.. అశ్వారరావుపేటలో 7వ రౌండ్‌ ముగిసే సరికి జనసేనకు 1110 ఓట్లు పడ్డాయి. ఇక నోటాకు 820 ఓట్లు వచ్చాయి. ఇక కొత్తగూడెంలో 5వ రౌండ్‌ ముగిసే సరికి జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌కి 391 ఓట్లు, నోటాకి 303 ఓట్లు పడ్డాయి. వైరాలో 8 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి సంపత్‌ నాయక్‌కి 1081 ఓట్లు, నోటాకు 581 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఈ విధంగా పోటీ చేసిన 8 స్థానల్లో కూడా జనసేన అభ్యర్థలకు నోటాకు మధ్యనే గట్టి పోటీ జరుగుతోంది. మరి ఈ ఎన్నికల్లో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి