iDreamPost

బాలీవుడ్ స్టార్ల విచిత్ర వ్యాధులు

బాలీవుడ్ స్టార్ల విచిత్ర వ్యాధులు

సాధారణంగా సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో జబ్బు ఉండటం దాని చుట్టూ కథ నడవటం ఎన్నోసార్లు చూశాం. గీతాంజలిలో నాగార్జున, గజినీలో సూర్య, భలే భలే మగాడివోయ్ లో నాని ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే నిజ జీవితంలోనూ కథానాయకులకు జబ్బులు ఉంటాయంటే ఆశ్చర్యం కలగకమానదు. చిన్నా చితక అయితే పట్టించుకోనవసరం లేదు కానీ ఇందులో కొన్ని ఆశ్చర్యం కలిగించేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ కు ట్రైజెమినల్ న్యూరాల్జియా ఉంది. అంటే మొహంలో ఉండే నరాల వల్ల వచ్చే వ్యాధి. ఎక్కువసేపు ఫేస్ లో కదలికలు ఇచ్చినా, మాట్లాడినా, బ్రష్ చేసినా విపరీతమైన నొప్పి మొదలవుతుంది.

షారుఖ్ ఖాన్ భుజాలకు అయిదుసార్లు శాస్త్ర చికిత్స జరిగింది. బ్యాక్ పెయిన్ కూడా ఉంది. వీటి కోసం తన వెంటే ఒక పర్మనెంట్ డాక్టర్ ఉన్నారు. హృతిక్ రోషన్ క్రానిక్ సబ్ డ్యురల్ హెమటొమాతో బాధ పడుతున్నారు. ఇది మెదడుకు సంబంధించిన సమస్య. సోనమ్ కపూర్ కు టీనేజ్ నుంచే డయాబెటీస్ ఇబ్బంది ఉంది. ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ తో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఈ వయసులోనూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయనను సుదీర్ఘంగా వెంటాడుతున్న మాయస్తినియా గ్రేవీస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది శరీరంలో బలహీనతను ప్రోత్సహించే జబ్బు.

సీనియర్ హీరో ధర్మేంద్ర ఇరవై ఏళ్ళ నుంచి డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇటీవలే కొంత సీరియస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాక కోలుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు 2007 మైనర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. దాని వల్ల వారసత్వంగా వచ్చిన మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ బయటపడ్డాయి. దీంతో ఇతను గట్టిగా పోరాటం చేసి కోలుకున్నారు. లీసా రే, మనీషా కొయిరాలా, సోనాలి బెంద్రేలు క్యాన్సర్ తో విజయవంతంగా ఫైట్ చేసి కంబ్యాక్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసుకి అక్యూట్ లుకేమియా ఉండేది. చూశారా సెలబ్రిటీలకు ఎంత చిత్ర విచిత్రమైన జబ్బులు ఉన్నాయో. రంగులు డబ్బులే కాదు జబ్బులతోనూ వీళ్ళ జీవితం గడుస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి