iDreamPost

ఈ ఫోటోలోని కుర్రాడు.. టాలీవుడ్ స్టార్ హీరో.. గుర్తు పట్టారా

ఈ ఫోటోలో స్మోక్ చేస్తూ కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు స్టార్ హీరో. ఇతడు మల్టీ టాలెంట్. హీరోనే కాదూ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కూడా. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి.

ఈ ఫోటోలో స్మోక్ చేస్తూ కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు స్టార్ హీరో. ఇతడు మల్టీ టాలెంట్. హీరోనే కాదూ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కూడా. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి.

ఈ ఫోటోలోని కుర్రాడు.. టాలీవుడ్ స్టార్ హీరో.. గుర్తు పట్టారా

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ అయ్యారు చాలా మంది యాక్టర్స్. సినిమా అంటే పిచ్చి, ఫ్యాషన్‌తో చదువు అయిపోగానే.. లక్షల జీతాలు రమ్మని పిలుస్తున్నా వద్దని ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలియని సినీ రంగాన్ని ఎంచుకుంటుని ఇటు వైపు వస్తున్నారు కొంత మంది కుర్రాళ్లు. కొత్త ప్రాంతానికి వచ్చి, ఎక్కడ ఉండాలో, ఎలా స్టార్ చేయాలో తెలియదు. చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా, కడుపు నిండా తిండి దొరక్కపోయినా.. జీవితంలో సక్సెస్ కావాలన్న పట్టుదల వారిని అటుగా నడిపిస్తుంది. తొలి నాళ్లలో చిన్న చిన్న రోల్ వచ్చినా వదలిపెట్టడం లేదు. తమను తాము ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో ఆ రోల్స్ చేస్తూనే.. హీరోగా ప్రయత్నిస్తున్నారు.

ఈ ఫోటోలో హీరో కూడా ఆ కోవకే వస్తాడు. ఇంతకు ఈ ఫోటోలో నటుడు ఎవరో గుర్తు పట్టారా..? హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి..తాను అనుకున్నది సాధించాడు. అతడిలో మస్తు షేడ్స్ ఉన్నాయి. కేవలం హీరో మాత్రమే కాదూ.. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యసర్ కూడా. ఇతడిలో కాస్త డేర్ కూడా ఎక్కువ. తనకు సినిమా నచ్చలేదు అంటే.. మధ్యలోనే ఈ సినిమా చేయలేనని తెగేసి చెబుతాడు. అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతుంటాడు. ఇంతకు ఎవరంటే.. దినేష్ నాయుడు అలియాస్.. విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. పక్కా హైదరాబాదీ అయిన విశ్వక్.. వెళ్లిపోమాకే అనే మూవీతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ చైల్డ్ ఆర్టిస్టుగా.. జగపతి బాబు, మీరా జాస్మిన్ మూవీ బంగారు బాబులో ఓ క్యారెక్టర్‌లో కనిపించినట్లు తెలుస్తోంది.

వెళ్లిపోమాకే మూవీలో అతడి నటన ఓకే అనిపించగా.. తరుణ్ భాస్కర్ మూవీ.. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపించాడు. ఫలక్ నామా దాస్ సినిమాస్ మల్టీపుల్ వర్క్ భుజాన వేసుకున్నాడు. ఆ సినిమాకు అతడే డైరెక్టర్, రైటర్, కో ప్రొడ్యసర్ కూడా. ఇక హిట్ మూవీతో సక్సెస్ అందుకున్న ఇతడు.. పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరీ దేవుడా అనే చిత్రాల్లో నటించాడు. ముఖ చిత్రంలో క్యామియో రోల్ పోషించాడు. దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో మెరిశాడు. ప్రస్తుతం గామీ, గాడ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలతో రాబోతున్నాడు. మార్చి 8న గామి విడుదల కాబోతుంది.  నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి