iDreamPost

విశాఖలో దారుణం.. ప్రేమ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని..!

దేశంలో మహిళలపై నిత్యం అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

దేశంలో మహిళలపై నిత్యం అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

విశాఖలో దారుణం.. ప్రేమ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని..!

ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న వయసు పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారి రెచ్చిపోతున్నారు. పట్టపగలు మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది ఆయతాయిలు కాలేజ్ అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించడం.. అది తట్టుకోలేక అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న విద్యార్థిని దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరాణానికి పాల్పపడింది. విద్యార్థిని పేరు తులసి. గత కొంత కాలంగా భరత్ అనే యువకుడు తులసిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించడంతో మానసికంగా ఆందోళనకు గురైంది తులసి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది.. వెంటనే భరత్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ అతని బుద్ది మార్చుకోకపోగా.. మరింత వేధించసాగాడు. తులసి ఒంటరిగా ఎక్కడ కనిపించినా అక్కడికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయడం.. తనను ప్రేమించాలని వేధిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలోనే తులసి తీవ్ర మనస్థాపానికి గురైంది. తన కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నా ఆ యువకుడు మాట వినకుండా తనను వేధించడం తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బుధవారం తులసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పపడింది. తులసి కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి చూడగానే విగతజీవిగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.. తమ కూతురు చావుకు భరత్ అనే యువకుడు కారణం అంటూ ఆరోపించారు. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ కూతురు అలా చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి