iDreamPost

కారును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు అగ్నికి ఆహుతి!

కారును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు అగ్నికి ఆహుతి!

నిత్యం ఏదో  ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనాల్లో  మంటలు కూడా చెలరేగి… అమాయాకులు కాలిబూడిదైపోతున్నారు. ఇలా కొందరి నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా యూపీలో కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు మంటలు అంటుకుని నలుగురు సజీవ దహనం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సహరాన్ పూర్ జాతీయ రహదారిపై  రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెనపై ప్రమాదం చోటుచేసుకుంది.  ఛాలెంజ్ గేట్ దగ్గర ఉన్న వంతెనపై ప్రమాదవశాత్తు కారును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పల్టీలు కొట్టిన కారులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారు అంతట వ్యాపించాయి.  దీంతో  కారులో ఉన్న నలుగురు బయటకు దిగేందుకు వీలు లేకపోయింది. ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని యోగి ఆదేశించారు. స్థానికులు అందిచిన సమాచారంతో  అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. కారుకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.  ఇక ఈ ప్రమాదం జరగడంతో ఆ జాతీయ రహదారిపై  భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సజీవ దహనమైన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మృతులు ఎవరు అనేది గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘోర ప్రమాదంపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: యువతి ఆత్మహత్య.. ఆమె కోసం రాత్రంతా ఎదురు చూసిన శునకం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి