iDreamPost

రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన TSRTC రాజధాని బస్సు!

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతున్నాయి. ఇటీవల కాలంలో రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది.

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతున్నాయి. ఇటీవల కాలంలో రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది.

రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన TSRTC రాజధాని బస్సు!

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అంతేకాక అకస్మాత్తుగా టైర్లు పేలడంతో కూడా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో ఓ కారు టైర్ పేలి.. పక్క రూట్ లో ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటన ఓ చిన్నారి తో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. తాజాగా సూర్యపేట జిల్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు. మరి.. ఈ ఘటనకు గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

శనివారం తెలంగాణ ఆర్టీసీ కి చెందిన రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. సూర్య పేట జిల్లా మావిళ్ల గూడెం వద్దకు రాగానే  బస్సు ముందు వెళ్తున్న డీసీఎం వాహనం  టైర్ పేలి పోయింది. దీంతో ఆ వాహనం కాస్తా అటుఇటు తిరగడం ప్రారంభించింది. దీంతో ఆ వాహనం వెనుకాలే ఉన్నా రాజధాని బస్సు  డ్రైవర్  అప్రమత్తమయ్యాడు. ఆ వాహనాన్ని ఢీ కొట్టకుండా  బస్సును రోడ్డు పక్కకు తిప్పాడు. అప్పటికే కాస్త వేగంగా ఉన్న ఆ బస్సు.. అదుపు తప్పి పొలంలో పల్టీలు కొట్టింది. అయితే ఈ ఘటన జరిగిన సందర్భంలో ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.  ఈ బస్సులోని ప్రయాణికుల్లో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వాళ్లంత సురక్షితంగా బయటపడ్డారు.

రాజధాని బస్సు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో, అంతేకాక పెద్ద గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి..చికిత్స అందించారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు కూడా తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. అలానే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నిండుతున్నాయి. ఎవరో చేసిన చిన్న నిర్లక్ష్యానికి మరోకరు బలవుతుంటారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలోని పెద్దఆరవీడు మండలంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములతో సహా ఆరుగురు మృతి చెందారు. అలానే శుక్రవారం హైదరాబాద్ ఓ బైకు, లారీ ఢీ కొని… ఇద్దరు తండ్రీకొడుకులు మృతి చెందారు. శనివారం రాజధానికి తృటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి