iDreamPost

ఘోర ప్రమాదం: కూలిన విమానం.. 65 మంది దుర్మరణం!

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాలు, మాన తప్పిదాలు, వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడే మార్పులు వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోర విమాన ప్రమాదం జరిగి.. 65 మంది దుర్మరణం చెందారు.

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాలు, మాన తప్పిదాలు, వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడే మార్పులు వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోర విమాన ప్రమాదం జరిగి.. 65 మంది దుర్మరణం చెందారు.

ఘోర ప్రమాదం: కూలిన విమానం.. 65 మంది దుర్మరణం!

ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతి లోపం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలానే ల్యాండిగ్ చేసే సమయంలో.. కొన్నిసార్లు పక్షులు ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. తరచూ జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు అందరిలో భయాందోళనకు కలిగిస్తున్నాయి. చాలా వరకు సాంకేతిక లోపాలను గమనించి పైలట్లు వెంటనే అత్యవసర ల్యాండిగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కొన్నిసారు మాత్రం దురదృష్టవశాత్తు గాల్లోనే ప్రాణాలు వదిలిన విషాద ఘటనలూ ఉన్నాయి. గతంలో నేపాల్ లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో దాదాపు 72 మంది మరణించారు. తాజాగా రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 65 మంది దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఓ విమానం కుప్పకూలింది. రష్యాకు చెందిన ఈ  సైనిక విమానంలో యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సైనిక విమానం కూలిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఆ దేశ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విమాన ప్రమాదంలో 65 మంది దుర్మరణం చెందినట్లు తెలిపింది.

అలానే ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలతో బయట పడ్డారా? అనేది కూడా తెలియలేదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సైనిక విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక సైనిక మిషన్‌ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు కొన్ని గంటల ముందు కెనడాలోని రిమోట్ నార్త్ వెస్ట్ టెరిటరీస్ సమీపంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి.. ఈ విమాన ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి