iDreamPost

బిడ్డలాంటి విద్యార్థినికి ఉపాద్యాయుడు అసభ్య మెసేజ్‌లు !

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు కొంతమంది విద్యార్థులను వేధించడం.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు కొంతమంది విద్యార్థులను వేధించడం.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బిడ్డలాంటి విద్యార్థినికి ఉపాద్యాయుడు అసభ్య మెసేజ్‌లు !

జన్మనిచ్చే తల్లిదండ్రుల కన్నా గురువుకి ఎంతో గొప్ప స్థానం ఇస్తుంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థానంలో ఉంచే గురువుని దేవుడితో పోలుస్తుంటారు. గురువులు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పంచడమే కాదు.. వాళ్లు తప్పుడు దారిలో నడిస్తే సరిదిద్ది సన్మార్గంలో నడిచేలా కృషి చేస్తారు. కానీ నేటి సమాజంలో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం లాంటివి చేయడంతో విద్యార్ధినులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడిలోని ఎస్‌డీఎస్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌డీఎస్ స్కూల్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎస్‌డీఎస్ స్కూల్ ఉపాధ్యాయుడు రూపేష్ పూజారీ.. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినికి అసభ్య మెసేజ్ లు పంపడం మొదలు పెట్టాడు. సదరు విద్యార్థిని కొన్ని రోజులు భరించి.. టీచర్ కి తనకు అలాంటివి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ టీచర్ వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోయాయి. టీచర్ ప్రవర్తనతో విసుగెత్తిపోయిన విద్యార్థిని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లి విచారించారు.

కొన్నిరోజుల నుంచి తమ కూతురిని రూపేష్ పూజారి అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ.. లైంగికంగా వేధిస్తున్నాడని స్కూల్ యాజమాన్యానికి చెప్పారు. అంతేకాదు మరోసారి తమ కూతురు జోలికి వస్తే స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న రూపేష్ మళ్లీ సదరు విద్యార్థినితో అలాగే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7న పాయిజన్ తీసుకుంది. ఆపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని తల్లిదండ్రులు హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిడ్ని, లివర్ పూర్తిగా పాడైపోవడంతో చికిత్స పొందుతూ విద్యార్థి కన్నుమూసింది. తమ కూతురు చావుకు రూపేష్ పూజారి కారణం అని విద్యార్థిని తల్లిదండ్రులు ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రూపేష్ పూజారి పై ఐపీసీ 354D,509,POSO చట్టం 12, 75JJ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి