iDreamPost

ఒక్కరోజు మురిపమే.. మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి! ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల దేశంలో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడిపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Gold and Silver Rates: ఇటీవల దేశంలో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడిపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఒక్కరోజు మురిపమే.. మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి! ఈ రోజు ధర ఎంతంటే?

దేశంలో ఈ మధ్య బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే జ్యులరీ షాపుల్లో రక రకాల ఆర్మమెంట్స్ డిజైన్లు అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో పసిడి కి విపరీతమైన డిమాండ్ పెరిగపోయింది.  గత కొంత కాలంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. కొనుగోలుదారులు పసిడి కొనాలంటే ఆలోచనలో పడుతున్నారు.  ఒకటీ రెండు రోజుల్లో స్థిరంగా ఉంటే.. తర్వాత ఒకేసారి వందల్లో పెరిగిపోతుంది. గత రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ షాక్ ఇస్తుంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పసిడి అంటే ఎవరైనా ఎంతో ఇష్టపడతారు.. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విలువ ఉంది. గత కొంత కాలంగా పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొన్నా, నిన్న కాస్త ఊరటనిచ్చిన పసిడి మళ్లీ షాక్ ఇస్తుంది. పసిడి ధరల విషయంలో ఒక్కరోజు మురిపమే అయ్యింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయల వరకు  పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,150 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,340 వద్దకు చేరింది. కేజీ వెండి ధరపై రూ.100 తగ్గి రూ. 89,900 వద్ద కొనసాగుతుంది.

today gold rates

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా తులం పై రూ.10 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,310 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.68,160 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.74,350 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,170 వద్ద కొనసాగుతుంది.ఢిల్లీలో కిలో వెండి రూ.100కు తగ్గి ప్రస్తుతం రూ.89,900 గా వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, కోల్ కతా లో కిలో వెండి ధర రూ.85,900 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.89,900 కు చేరింది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి