iDreamPost

దడ పుట్టిస్తున్న పుత్తడి.. తులం 80 వేలకు చేరనుందా? ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ఓ వైపు భానుడి భగ భగ మరో వైపు బంగారం భగ భగ చూస్తుంటే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ప్రతిరోజూ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

Gold and Silver Rates: ఓ వైపు భానుడి భగ భగ మరో వైపు బంగారం భగ భగ చూస్తుంటే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ప్రతిరోజూ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

దడ పుట్టిస్తున్న పుత్తడి.. తులం 80 వేలకు చేరనుందా? ఈ రోజు ధర ఎంతంటే?

ప్రస్తుతం దేశంలో పసిడి ధరలు వరుసగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది పసిడి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కొంత కాలంగా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో పలు మార్పుల ప్రభావం బంగారం, వెండి పై తీవ్రంగా పడుతుందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పసిడి ధరలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. రికార్డు మోత మోగిస్తూ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఒకటీ రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టినా… మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి ధరలు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం. అందుకే పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. ఆపద సమయంలో పనికి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తుంటారు. ఈ కారణం చేతనే గత కొంత కాలంగా పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. దీంతో పసిడి, వెండి కొనుగోలు బాగా పెరిగిపోవడంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.  ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు రూ.100 పెరిగి రూ.66,2100 మార్క్ వద్ద ఉంది. అంతకు ముందు ఈ రేటు రూ.350 పెరిగింది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.72,230 వద్ద కొనసాగుతుంది. ఇది కిందటి రోజు రూ.380 వరకు పెరిగింది. వెండి ధర మాత్రం కాస్త దిగి వచ్చింది. దేశ రాజధానిలో రూ.500 వరకు తగ్గి రూ.85 వేల మార్క్ వద్ద ఉంది. అంతకు ముందు రోజు రూ.1000 పెరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుతం రూ.500 తగ్గి కేజీ రూ.88,300 వద్ద ట్రెండ్ అవుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,230 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.88,300వద్ద కొనసాగుతుంది.

today gold rate

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,760లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,740 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,370 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.84,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,900వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.88,400 లు ఉండగా, ఢిల్లీ లో రూ.85,000 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి