iDreamPost

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే!

Gold and Silver Rates: దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. దసరా, దీపావళి తర్వాత వరుసగా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మార్కెట్ లో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతు వస్తున్నాయి.

Gold and Silver Rates: దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. దసరా, దీపావళి తర్వాత వరుసగా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మార్కెట్ లో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతు వస్తున్నాయి.

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే!

దేశంలో ప్రస్తుతం బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే మార్పుల వల్ల పసిడి హెచ్చు తగ్గులు అవుతూ వస్తుంది. ఈ నెలలో అమాతం పెరిగిన బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది. డిసెంబర్ చివరినాటి మరింత పెరిగే అవకాశం ఉందని.. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

పసిడి కొనుగోలు దారులకు అలర్ట్.. గత రెండు రోజులుగా భారీగా పెరిగిపోతూ వచ్చిన బంగారం నేడు కాస్త ఊరట కల్పించాయి. మార్కెట్ లో నేటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.. బంగారం మాత్రమే కాదు వెండి ధరల్లో కూడా మార్పులు లేవు. గత నెలతో పోల్చుకుంటే ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. నిన్నటి మార్కెట్ లో 24 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.63,760 ఉండగా నేడు అదే ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ ధర నిన్న రూ.58,450 ఉండగా అదే కంటిన్యూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ ల గోల్డ్ రేటు రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,760 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో రూ. 83,500 వద్ద కొనసాగుతుంది.

ఇఖ దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ ల పసిడి ధర రూ.58,600 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,910 వద్ద కొనసాగుతుంది. చెన్నై లో 22 క్యారెట్ ల బంగారం ధర రూ.59,150ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,530 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్ ల పసిడి ధర రూ.రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,780 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరులో 22 క్యారెట్ ల గోల్డ్ రేటు రూ.రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,760 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు చెన్నైలో కిలో వెండి ధర రూ. రూ.83,500 వద్ద ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 80,500 ఉండగా, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 79 వేల వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి