iDreamPost

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే!

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే!

దేశంలో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. వినాయక చవితి తర్వాత వరుస పండుగలు రావడంతో బంగారం కొనుగోలు కోసం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలకు బంగారం కోనుగోలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. గత నెల రోజుల నుంచి మొన్నటి వరకు బంగారం ఒకటీ రెండు రోజులు తప్ప ప్రతిరోజూ తగ్గుతూ వచ్చింది. నెలలో ఏకంగా రూ.3000 వేల వరకు బంగారం ధర తగ్గిపోయింది. కానీ మళ్లీ మూడు రోజుల నుంచి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..

నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,980 గా కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ కి రూ.400, 24 క్యారెట్ల గోల్డ్ కి 440 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,150 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,980 గా ట్రెండ్ అవుతుంది. ముంబై, బెంగళూరు లో కూడా ఇదే ధర కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,300 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,130 గా ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,700 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,580 గా కొనసాగుతుంది.

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారంతో పోటీ పడుతూ పెరిగిపోతుంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ పట్నంలో కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.2000 లకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75 వేలకు చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 వేల వరకు పలుకుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000లు కొనసాగుతుంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.72,100లుగా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా గత నెల వరుసగా బంగారు, వెండి రేట్లు తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పరుగులు పెడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి