iDreamPost

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా కూడా పసిడి ప్రియులు కోనుగోలు విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా కూడా పసిడి ప్రియులు కోనుగోలు విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం అంటే ఎవరికైనా ఎంతో ఇష్టం.. ముఖ్యంగా భారత దేశంలో పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి మహిళలు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇటీవల బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ లో భారీగా పతనమైన పసిడి ధరలు అక్టోబర్ లో ఆకాశాన్ని తాకాయి. గత ఆరు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ షాక్ ఇచ్చింది. దీంతో బంగారం కొనాలా? వద్దా? అన్న ఆలోచనలో పడిపోయారు వినియోగదారులు. దీపావళి పండుగ ముఖ్యంగా ధన్‌తేరస్ వేళ బంగారం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి.. దీంతో అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషాయినికి వస్తే..

సాధారణంగా మహిళలు, పురుషులు పండగలు, పుట్టిన రోజు, పెళ్లిళ్ళ సందర్భంగా జ్యూలరీ షాపులకు క్యూ కడుతుంటారు. తమకు ఇష్టమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల బంగారం ధరలు పెరగడం, తగ్గడం సర్వసాధారణం అయ్యింది. గత నెల ప్రతిరోజూ బంగారం రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఈ నెల కొద్దిగా తగ్గుముఖం పట్టినా.. నిన్నటి నుంచి మళ్లీ చుక్కులు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,090 లుగా కొనసాగుతుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ, కేరళ, బెంగుళూరు, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,090 ల వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేట్ రూ56,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.61,240 ల వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,090 ల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.74,000 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ.800 వరకు పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,00లు ఉండగా, చెన్నైలో రూ.77,000 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,750 వద్ద ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి