iDreamPost

పాస్‌వర్డ్ షేర్ చేయలేదని ఫ్రెండ్ ని హత్య చేసిన స్నేహితులు!

నేటికాలంలో చాలా మంది వివిధ వాటికి బానిసలు గా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో తాము అనుకున్నది జరిగేందుకు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా పాస్ వర్డ్ చెప్పలేదని ఓ యువకుడిని అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు.

నేటికాలంలో చాలా మంది వివిధ వాటికి బానిసలు గా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో తాము అనుకున్నది జరిగేందుకు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా పాస్ వర్డ్ చెప్పలేదని ఓ యువకుడిని అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు.

పాస్‌వర్డ్ షేర్ చేయలేదని ఫ్రెండ్ ని హత్య చేసిన స్నేహితులు!

ప్రస్తుతం సమాజంలో చాలా మంది వివిధ రకాల వాటికి బానిసలవుతున్నారు. జూదం, మద్యం వంటి వివిధ చెడు వ్యసనాలకు బానిసలు గా మారడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే..చదుకునే విద్యార్థులు సైతం ఆల్ లైన్ గేమ్స్ కు  బానిసలుగా మారిపోతున్నారు. గంటల తరబడి ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఈక్రమంలోనే లక్షల డబ్బులను సైతం పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. పలు సందర్భాల్లో హత్యలు సైతం జరిగాయి.  తాజాగా పాస్ వర్డ్ చెప్పలేదని  ఓ విద్యార్థిని అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్ లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పూర్ణిమా దాస్ అనే మహిళ కుటుంబం నివాసం  ఉంటుంది. ఆమెకు పాపాయి దాస్ అనే 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు ఆన్‌లైన్ మొబైల్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతుండే వాడు. ఇటీవలే ఆన్ లైన్ గేమ్ పాస్ వర్డ్ స్నేహితులు అడగ్గా పాపాయి దాస్ ఇవ్వలేదు. పాస్ వర్డ్ చెప్పలేదనే కోపంతో నలుగురు స్నేహితులు పాపాయి దాస్ ను దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని కాల్చివేసి అడవిలో పడేశారు. ఇదే విషయం పోలీసులు దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. అసలు ఈ నేరం బయట పడటానికి అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదే కీలకం అయ్యింది.

పాపాయి దాస్ తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఎక్కడ అతడి ఆచూకి లభించలేదు. ఈ క్రమంలోనే పాపాయి దాస్ మృతదేహం జనవరి 15న అడవిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసుపై పూర్తి స్థాయిల దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పాపాయి హత్యకు గురైనట్లు నిర్థారించారు. దీంతో హత్యకు పాల్పడిన నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమై విషయాలను తెలిపారు. పాపాయి దాస్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఫరక్కా బ్యారేజ్‌లోని ఒక క్వార్టర్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాడు. జనవరి 8వ తేదీన కూడా పాపాయి దాస్ రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

మరుసటి రోజు అతడి తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ హత్యకు పాల్పడిన నలుగురు మైనర్లు కావడంతో రేపు జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. పాపాయి దాస్ ను హత్య చేసిన అనంతరం పెట్రోల్ తో కాల్చడానికి ప్రయత్నించినట్లు పోలీసులు విచారణలో తేలింది. పాక్షికంగా కాలిపోయిన మృతదేహాన్ని ఫరక్కా ఫీడర్‌లోని నిశీంద్ర ఘాట్‌లో పడేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఫోన్ లొకేషన్ ద్వారా మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. దాస్ శరీరంపై ఉన్న టాటూలను బట్టి మృతుడిని తల్లి గుర్తించగలిగింది. మరి.. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలు గా మారి పిల్లలు కూర్రంగా మారడానికి గల కారణాలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి