iDreamPost

ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసిన టీ సరదా!

  • Published Feb 27, 2024 | 8:01 PMUpdated Feb 27, 2024 | 8:01 PM

అతివేగంతో ప్రయాణించటంతో పాటు క్షణ నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఈ మధ్యకాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది ఎక్కడంటే..

అతివేగంతో ప్రయాణించటంతో పాటు క్షణ నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఈ మధ్యకాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది ఎక్కడంటే..

  • Published Feb 27, 2024 | 8:01 PMUpdated Feb 27, 2024 | 8:01 PM
ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసిన టీ సరదా!

నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలనేవి తీవ్ర కలకరం రేపుతోంది. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూసిన ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఈ ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో.. గాయపడిన వారి కంటే మృత్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అసలు అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తులను కూడా.. ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలిస్తోంది. దీంతో ఇంట్లో ఉన్న మనుషులు బయటకు వెళ్లినప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలామంది భయందోళనకు గురవుతున్నారు. తాజాగా మరోసారి హైదారాబాద్ లోని రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలిగొన్నది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం సరిగ్గా ఆందోల్ మండలం.. మాసాన్‌పల్లి శివారులోని నాందేడ్-అఖోలా జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై అగి ఉన్న కారును అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మృతులు జోగిపేటకు చెందిన యువకులు ముకురం (22), హాజీ (26), వాజీద్ (28)గా గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. అలాగే క్షతగాత్రలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు టీ తాగేందుకు కారులో బయటకు వచ్చారు. ఇక ముందుగా చౌటకూర్ దాబాకు వెళ్లారు. అక్కడ దాబా మూసి ఉండడంతో అదే కారులో మాసన్‌పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి టీ తాగారు. తిరిగి వెళ్తూ మాసాన్‌పల్లి వంతెన కింద టాయ్‌లెట్ కోసం కారు ఆపి దిగిన సమయంలో.. టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధిత యువకులు మెకానిక్స్‌గా పని చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి, అతి వేగంగా వచ్చిన లారీ ముగ్గురు యువకుల ప్రాణాలను బలికొన్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి