iDreamPost

తనపై భర్తకి ఉన్న పగను గుర్తించలేక..బలైపోయిన మహిళ!

ఇటీవల కాలంలో దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు పెద్ద విషాదాలను మిల్చుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలో ఎవరో ఒకరి తొందర పాటుతో..మరొకరు బలవుతున్నారు. తాజాగా ఓ భర్త..తన భార్యపై పెంచుకున్న పగ కారణంగా ఘోరం జరిగింది.

ఇటీవల కాలంలో దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు పెద్ద విషాదాలను మిల్చుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలో ఎవరో ఒకరి తొందర పాటుతో..మరొకరు బలవుతున్నారు. తాజాగా ఓ భర్త..తన భార్యపై పెంచుకున్న పగ కారణంగా ఘోరం జరిగింది.

తనపై భర్తకి ఉన్న పగను గుర్తించలేక..బలైపోయిన మహిళ!

సంసారం అనే చదరంగంలో అనేక ఆటుపోటులు ఉంటాయి. అన్నిటిని ఓర్చుకుంటూ ముందుకు సాగాలి. అయితే నేటికాలంలో చాలా మంది దంపతుల మధ్య ప్రతి చిన్న విషయానికి వాగ్వాదం జరుగుతుంది. పంతాలకు పోయి మరీ  పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చిన్న విషయాలకే గొడవపడి విడాకుల వరకు వెళ్తున్న జంటలు ఒకవైపు ఉంటే…పగ,పంతాలతో హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న జంటలు మరోవైపు ఉన్నాయి. తాజాగా ఓ వివాహిత..తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన  కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు చెందిన పోల్క రంగస్వామికి వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం తిరుమాయిపల్లెకు చెందిన కుమారి(30)తో 14  ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉంది. పెళ్లైలన చాలా ఏళ్ల పాటు ఈ దంపతులు ఇద్దరు సంతోషంగానే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా నుంచి వారి కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. నిత్యం ఆ దంపతులిద్దరు గొడవలు పడుతూ ఉన్నారు. చివరకు దంపతులు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే భర్త వేధింపులు భరించలేకపోయినా కుమారి పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లారు. భర్త పెట్టే టార్చర్ భరించలేక పోతున్నాని, అతనికి సర్థి చెప్పాలంటూ పినతల్లి సుబ్బలక్ష్మితో చెప్పింది. ఈ మాటలు చెప్పేందుకు పినతల్లి ఇంటికి మూడురోజుల కిందట ఆమె అవుకుకి వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను, గ్రామపెద్దలను కుమారి ఆశ్రయించారు. ఆ సమయంలో వారందరూ అందుబాటులో లేకపోవడంతో ఇంకొక రోజు వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే తిరిగి పుట్టింటికి వెళ్లేందుకు సుబ్బలక్ష్మి, కుమారి బస్టాండుకు చేరుకున్నారు. అయితే ఎప్పటి నుంచి భార్యపై పోల్క రంగస్వామి పగ పెట్టుకున్నట్లు సమాచారం.

ఈక్రమంలోనే వారిద్దరు బస్టాండ్ కి వచ్చిన విషయం తెలిసిన పోల్క రంగస్వామి అక్కడి  చేరుకున్నాడు. సమీపంలో కొబ్బరిబోండాల దుకాణం వద్ద కత్తి తీసుకొని కుమారి, ఆమె పిన్నిపై రంగస్వామి దాడి చేశాడు. ఈ దాడిలో కుమారి, సుబ్బలక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుమారి నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సుబ్బలక్ష్మి చికిత్స పొందుతున్నారు. నిందితుడు రంగస్వామి చెడు అలవాట్లు ఉన్నాయని, గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుని తెగదెంపులు చేసుకున్నట్లు, బాధితురాలు సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. మరి..భార్యలపై దాడి చేసిన ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్ష విధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి