iDreamPost

నెటిజెన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలు

నెటిజెన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలు

మనకేదైనా సమాచారమో లేదా ఫోటోనో వీడియోనో కావాలంటే క్షణం ఆలోచించకుండా ముందుగా వెళ్ళేది గూగుల్ కే. అసలిది లేకుండా ఒకప్పుడు జనం హైదరాబాద్ లాంటి నగరాల్లో అడ్రెస్ లు ఎలా వెతికి పట్టుకునేవారోనని అనుమానం వస్తుంది. అంతగా ఈ సెర్చ్ ఇంజిన్ మన లైఫ్స్ లో ఇంకిపోయింది. ఇక కొత్త సినిమాలు రిలీజైనప్పుడు మూవీ లవర్స్ దీని మీద ఎంత ఆధారపడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి శుక్రవారం గూగుల్ ఓపెన్ చేయడం సదరు చిత్రం తాలూకు రివ్యూలు రేటింగ్ లు చూసి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునే బ్యాచ్ కోట్లలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఏ సినిమాల మీద ఎక్కువ వెతికారనే ఆసక్తి కలగడం సహజం.

దీనికి సంబందించిన స్టాటిస్ టిక్స్ లో ఇంటరెస్టింగ్ అనిపించే విషయాలున్నాయి. ఆర్ఆర్ఆర్ ని 2022లో అత్యధికంగా వెతికి చూసిన మూవీగా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. పుష్ప 1 రెండో స్థానం, ఆ తర్వాత లైగర్, కార్తికేయ 2, రాధే శ్యామ్ లు టాప్ 5లో మిగిలిన స్థానాలను అలంకరించాయి. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ కాకుండా ఇక్కడ రెండు డిజాస్టర్లు ఉండటం అసలు ట్విస్టు. సీతారామం, ఆది పురుష్. శ్యామ్ సింగ రాయ్, మేజర్, సర్కారు వారి పాట గురించి నెటిజెన్లు విపరీతమైన ఆసక్తి చూపించారు. తమిళంలో విక్రమ్ మలయాళంలో హృదయం, కన్నడలో కెజిఎఫ్ 2 టాప్ ప్లేస్ ని అలకరించాయి. సౌత్ ఇండియా మొత్తం చూస్తే మాత్రం కెజిఎఫ్ 2నే నెంబర్ వన్.

ఈ లెక్కన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని తెలుసుకునేందుకు ఆడియన్స్ ఎంతగా గూగుల్ మీద ఆధారపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హీరోల ఇమేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా విడుదలకు చాలా టైం ఉన్న ఆది పురుష్, దారుణంగా ఫ్లాప్ అయిన లైగర్ కూడా లిస్టులో చోటు సంపాదించుకున్నాయి. రాబోయే రోజుల్లో ఫైవ్ జి లాంటి అప్ డేటెడ్ టెక్నాలజీతో పాటు ఓటిటిల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి గూగుల్ రోల్ మరింత కీలకం కానుంది. హిందీలో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని నార్త్ ఆడియన్స్ ఎక్కువగా బ్రౌజ్ చేశారు. సంచలనం రేపిన ది కాశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ తర్వాతి ప్లేసుల్లో ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి