iDreamPost

చిన్న సినిమాల పెద్ద నమ్మకం

ముందుగా చెప్పాల్సింది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గురించి. బాలీవుడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస డిజాస్టర్లతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నార్త్ ఇండస్ట్రీకి ఇదే ఊపిరినివ్వాలని ట్రేడ్ తో పాటు సగటు మూవీ లవర్స్ అందరూ ఆశిస్తున్నారు.

ముందుగా చెప్పాల్సింది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గురించి. బాలీవుడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస డిజాస్టర్లతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నార్త్ ఇండస్ట్రీకి ఇదే ఊపిరినివ్వాలని ట్రేడ్ తో పాటు సగటు మూవీ లవర్స్ అందరూ ఆశిస్తున్నారు.

చిన్న సినిమాల పెద్ద నమ్మకం

ఈ వారం రాబోయే కొత్త సినిమాల సంగతులు కాసేపు పక్కనపెడితే ఇప్పుడందరి చూపు సెప్టెంబర్ 9 మీద ఉంది. ఆ రోజు ఆసక్తికరమైన క్లాష్ బాక్సాఫీస్ వద్ద నెలకొనబోతోంది. ముందుగా చెప్పాల్సింది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గురించి. బాలీవుడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస డిజాస్టర్లతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నార్త్ ఇండస్ట్రీకి ఇదే ఊపిరినివ్వాలని ట్రేడ్ తో పాటు సగటు మూవీ లవర్స్ అందరూ ఆశిస్తున్నారు. భారీ పెట్టుబడులు సాగిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, లైగర్ లు దారుణంగా దెబ్బ కొట్టడం నష్టాలు మాములుగా లేవు. కార్తికేయ 2 లేకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. ఇవాళ రిలీజ్ అవుతున్న సీతారామంకు సైతం ఇదే స్పందన దక్కుతుందనే అంచనాలున్నాయి

దీని సంగతలా ఉంచితే అదే రోజు రాబోతున్న రెండు బడ్జెట్ సినిమాల ధైర్యం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అందులో మొదటిది శర్వానంద్ ఒకే ఒక జీవితం. తమిళ తెలుగు బాషల బైలింగ్వల్ గా రూపొందిన ఈ టైం ట్రావెల్ డ్రామా ఎప్పుడో పూర్తయ్యింది.రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా అమల అక్కినేని కీలక పాత్ర పోషించారు. టీజర్ గట్రా ఆసక్తి కలిగించేలా ఉన్నాయి అసలు ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందో అంతు చిక్కలేదు. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లతో శర్వా మార్కెట్ బాగా దెబ్బ తింది. లేట్ అవ్వడానికి అదీ ఒక కారణమే. కొద్దిరోజుల నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టారు కానీ బజ్ తేవడంలో టీమ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Big faith in small films
ఇక కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని కూడా అదే రోజు వస్తోంది. సెబాస్టియన్, సమ్మతమే ఫలితాలు ఇతని ఇమేజ్ మీద కూడా ప్రభావం చూపించాయి. దీంతో ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన ఒత్తిడి ఉంది. అసలే సగమయ్యాక దర్శకుడు మారాడు. బాధ్యతలు ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేమ్ శ్రీధర్ గాదెకు ఇచ్చారు. మణిశర్మ సంగీతంలోని రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి.

ఇప్పుడీ రెండు బ్రహ్మాస్త్ర లాంటి భారీ ప్యాన్ ఇండియా విజువల్ వండర్ తో తలపడటం అంటే సాహసమే. కంటెంట్ మీద నమ్మకమో లేక వేరే ఆప్షన్ లేని పరిస్థితి ఏమో కానీ బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా ఉండనుంది. సత్యదేవ్ తమన్నాల గుర్తుందా శీతాకాలం ముందు 9 అనుకున్నారు కానీ 23కి వాయిదా పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి