iDreamPost

ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలు ఇవే! ఆ సూపర్ హిట్‌తో పాటు..

  • Published Mar 25, 2024 | 1:35 PMUpdated Mar 25, 2024 | 1:35 PM

This Week OTT Releases: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరి, ఈ వారం ఓటీటీలోకి రాబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

This Week OTT Releases: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరి, ఈ వారం ఓటీటీలోకి రాబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

  • Published Mar 25, 2024 | 1:35 PMUpdated Mar 25, 2024 | 1:35 PM
ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలు ఇవే! ఆ సూపర్ హిట్‌తో పాటు..

ఎప్పటిలానే ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో వారం వచ్చేసింది. ప్రతి వారం అన్ని జోనర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీనితో మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా గురించి తెలుసుకుందాం. ఈ సినిమాల లిస్ట్ చూస్తే రాబోయే వీకెండ్ కోసం ఇప్పటినుంచే అంతా ఎదురుచూస్తూ ఉండడం ఖాయం. వీటిలో మలయాళం సూపర్ సక్సెస్ అయిన సినిమాతో పాటు.. ఒక మంచి హర్రర్ సినిమా కూడా ఉంది. మరి ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.

1) ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మలయాళీ సూపర్ హిట్ మూవీ ప్రేమలు .. సాధించిన సక్సెస్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఫిబ్రవరి 9న ఒరిజినల్ భాషలో విడుదల అయ్యి.. మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాకు వచ్చిన డిమాండ్ చూసి.. మార్చి 8న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.. ఇక తెలుగులో ఈ సినిమా టాప్ డైరెక్టర్స్ , స్టార్స్ నుంచి ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు మార్చి 29నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది.

2) ఇన్‌స్పెక్టర్ రిషి -ప్రైమ్ వీడియో
ఈ మధ్య కాలంలో ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన ఒరిజినల్స్ లో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ఒకటి. ఈ క్రైమ్ , హర్రర్ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ త‌మిళంలో తెర‌కెక్కింది. ఈ సిరీస్ కు ల‌హిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ మార్చి 29 నుంచి తెలుగు, తమిళంతో పాటు మరొక మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

3) లవర్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
లవర్ సినిమా తమిళంలో సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా ఇప్ప్పటికే చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ తమిళ సూపర్ హిట్.. మార్చి 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) లూటేరే – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
లూటేరే వెబ్ సిరీస్ ఇప్పటికే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 22 నుంచే ఓటీటీలోకి వచ్చింది కానీ.. ఇప్పటివరకు కేవలం రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక మార్చి 28న మరొక ఎపిసోడ్ ను రిలీజ్ చేయనున్నారు. మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారట మేకర్స్.

5) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో – నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. ఇక మార్చి 29నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

6) పట్నా శుక్లా – డిస్నీ పస్ల్ హాట్‌స్టార్
పట్నా శుక్లా మూవీ ఒక కోర్టు రూమ్ డ్రామా.. బీహార్ లో జరిగిన ఒక ఎడ్యుకేషనల్ స్కామ్ గురించి వివరిస్తూ.. ఆ కేసు ను డీల్ చేసే ఓ లాయర్ కథ ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రవీనా టండన్ నటించారు. ఈ మూవీ మార్చి 29నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరి, ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి