iDreamPost

నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న టాప్‌ 10 సినిమాలివే.. తెలుగు సినిమాలేవంటే!

  • Published Feb 28, 2024 | 12:25 PMUpdated Feb 28, 2024 | 12:25 PM

Netflix Top 10 Movies: ఓటీటీ లలో వరుసగా సినిమాల జాతర నడుస్తోంది. ఈ క్రమంలో ప్రతివారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ 10 లో ఉన్న సినిమాలు ఇలా ఉన్నాయి.

Netflix Top 10 Movies: ఓటీటీ లలో వరుసగా సినిమాల జాతర నడుస్తోంది. ఈ క్రమంలో ప్రతివారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ 10 లో ఉన్న సినిమాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 28, 2024 | 12:25 PMUpdated Feb 28, 2024 | 12:25 PM
నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న టాప్‌ 10 సినిమాలివే.. తెలుగు సినిమాలేవంటే!

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఉన్న అన్నిటిలో.. బెస్ట్ అనిపించుకుంటూ.. ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ను పొందిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గా బెస్ట్ అనిపించుకుంటుంది నెట్ ఫ్లిక్స్ . అయితే, ఒకప్పుడు పెద్దగా గుర్తింపు రాని నెట్ ఫ్లిక్స్ కు ఇప్పుడు మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రముఖ చిత్రాలను.. ముందుగానే భారీ ధరలకు కొంటూ.. మిగిలిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 25వరకు ఎక్కువ మంది ప్రేక్షకులు.. ఆదరించిన టాప్ టెన్ సినిమాల జాబితా ఇలా ఉంది.

1) డంకీ:
బాలీవుడ్ యాక్టర్ షారుక్ నటించిన డంకీ.. భారీ అంచనాల మధ్య .. టాలీవుడ్ మూవీకి పోటీగా థియేటర్ లో విడుదల అయింది. కానీ, విడుదల తర్వాత ఈ మూవీ ఊహించినంత రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది. కానీ, ఓటీటీ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఈ మూవీ ఎక్కువ వ్యూస్ తో దూసుకుపోతుంది.

2) భక్షక్:
బాలీవుడ్ బ్యూటి భూమి పెడ్నేకర్ జర్నిలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో నటించిన.. ఇన్వేస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భక్షక్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హాస్టల్స్ లో ఉండే .. అనాథ బాలికలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.

3) యానిమల్ :
ఈ సినిమా విడుదల తర్వాత ఓ రకంగా థియేటర్స్ ను దున్నేసిందని చెప్పి తీరాలి. రణబీర్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్ ప్రదాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వేగంగా దూసుకుపోతూ.. ఈ వారం టాప్ 10లో నిలిచింది.

4) గుంటూరు కారం (హిందీ):
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో .. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన సంక్రాంతి కానుకగా “గుంటూరు కారం” సినిమా విడుదలైంది. మొదట ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా .. రోజులు గడిచే కొద్దీ .. ఫ్యామిలి ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సంపాదించుకుని.. బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి “నెట్ ఫ్లిక్స్” ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 4 స్థానాన్ని సంపాదించుకుంది.

5)గుంటూరు కారం (తెలుగు):
ఇక గుంటూరు కారం తెలుగు వెర్షన్ ఓటీటీ లో “గుంటూరు కారం” మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతోంది. పైగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.

6) డ్యూన్:
జోన్ స్పైహ్ట్స్, ఎరిక్ రోత్‌ల స్క్రీన్‌ప్లేతో.. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించిన.. అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ “డ్యూన్”. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆ.. ఈ వారం ఆరవ స్థానాన్ని సంపాదించుకుంది.

7) తృ మై విండో లుకింగ్ ఎట్ యు :
త్రూ మై విండో అనే మూవీ .. స్పానిష్ టీన్ రొమాంటిక్ డ్రామా .. ఇది అరియానా గోడోయ్ రాసిన అదే పేరుతో ఉన్న నోవెల్ ఆధారంగా తీసుకుని.. ఎడ్వర్డ్ సోలా స్క్రీన్ ప్లే నుండి మార్కల్ ఫోరెస్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం ఏడవ స్థానాన్ని సంపాదించుకుంది.

8) హాయ్ నాన్న( హిందీ):
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ పాప “. ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక తెలుగులోను ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

9) జవాన్ :
షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన జవాన్ మూవీ తెలుగు వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది.

10) సలార్ :
ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ.. ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా చేసిన సందడి అంత ఇంత కాదు. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం పదవ స్థానాన్ని సంపాదించుకుంది.

మరి నెట్ ఫ్లిక్స్ లో కొనసాగుతున్న టాప్ 10 మూవీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి