iDreamPost

ఈ వారం ఓటీటీలోకి 27 అద్భుతమైన సినిమాలు..

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషలకు చెందిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషలకు చెందిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి 27 అద్భుతమైన సినిమాలు..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ బాగా పెరిగింది. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఓటీటీ ఓ నిత్యావసరం అయిపోయింది. జనాలు థియేటర్లకు వెళ్లి చిత్రాలు చూడ్డం బాగా తగ్గించేశారు. ఇంటి దగ్గరే ఉండి తమకు నచ్చిన సినిమాలను, నచ్చిన సమయంలో చూసేస్తున్నారు. థియేటర్లలో పది సినిమాలు చూసే ఖర్చుతో ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ల సంవత్సరం సబ్‌స్క్రిప్చన్‌ తీసుకునే అవకాశం ఉండటంతో.. చాలా మంది ఓటీటీలకే ఓటేస్తున్నారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు మరింత చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త కొత్త సినిమాలను, షోలను, వెబ్‌ సిరీస్‌లను తమ ప్లాట్‌ ఫామ్‌లో విడుదల చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మూవీలను వారి ముందుకు తీసుకువస్తున్నాయి. దీంతో ఓటీటీకి అలవాటు పడ్డ వారు వెనక్కు రాలేకపోతున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే పలు ముఖ్యమైన ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు ఈ వారం దాదాపు 27 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తెచ్చాయి.

డిసెంబర్‌ 25 నుంచి 31 వరకు ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

బుక్‌ మై షో

  • ట్రోల్స్‌ అండ్‌ టుగెదర్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 29

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ద కర్స్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 29

జియో సినిమా

  • ఆస్టరాయిడ్‌ సిటీ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 29
  • ఎవ్రిబడీ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 30

జీ 5

  • దోనో ( హిందీ ) డిసెంబర్‌ 29
  • వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ ( హిందీ ) డిసెంబర్‌ 29
  • సఫేద్‌ ( హిందీ ) డిసెంబర్‌ 29

హాట్‌ స్టార్‌

  • మంగళవారం ( తెలుగు) డిసెంబర్‌ 26
  • 12th​ ఫెయిల్‌ ( తెలుగు ) డిసెంబర్‌ 29

అమెజాన్‌ ప్రైమ్‌

  • కటాటన్‌ ఎస్‌ఐ బాయ్‌ ( ఇండోనేషియన్‌) డిసెంబర్‌ 27
  • టైగర్‌ 3 (హిందీ ) డిసెంబర్‌ 31

నెట్‌ఫ్లిక్స్‌

  • రికీ గెర్వైస్‌ : అర్మగెడ్డోన్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 25
  • స్నాగ్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 25
  • కో గయే హమ్‌ కహా ( హిందీ ) డిసెంబర్‌ 26
  • థాంక్యూ ఐ యామ్‌ సారీ ( స్వీడిస్‌ ) డిసెంబర్‌ 26
  • ఏ వెరీ గుడ్‌ గాళ్‌ ( తగలాల్‌) డిసెంబర్‌ 27
  • హెల్‌ క్యాంప్‌ : టీన్‌ నైట్‌ మేర్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 27
  • లిటిల్‌ డిక్సీ ( ఇంగ్లీస్‌ ) డింసెబర్‌ 28
  • మిస్‌ శాంపో ( మాండరిన్‌ ) డిసెంబర్‌ 28
  • పోకేమ్యాన్‌ కన్సేర్ట్‌ ( జపనీస్‌ ) డిసెంబర్‌ 28
  • అన్నపూరణి ( తెలుగు ) డిసెంబర్‌ 29
  • బ్యాడ్‌ ల్యాండ్స్‌ ( జపనీస్‌ ) డిసెంబర్‌ 29
  • బెర్లిన్‌ ( స్పానిష్‌ సిరీస్‌) డిసెంబర్‌ 29
  • శాస్త్రి విరుద్‌ శాస్త్రి ( హిందీ ) డిసెంబర్‌ 29
  • త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ ) డిసెంబర్‌ 29
  • డేంజరస్‌ గేమ్‌ : ద లెగసీ మర్డర్స్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 31
  • ద అబాండడ్‌ ( మాండరిన్‌ ) డిసెంబర్‌ 31

మరి, ఈ వారం పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదల కానున్న ఈ సినిమాల్లో మీ ఫేవరేట్‌ ఏదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి