iDreamPost
android-app
ios-app

నాని గ్యాంగ్ లీడర్‌లోని ఈ అమ్మాయిని.. ఇప్పుడు చూస్తే మతి పోవడం ఖాయం!

  • Published Dec 01, 2023 | 6:12 PM Updated Updated May 20, 2024 | 5:47 PM

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు.. కొన్ని సంవత్సరాలకు హీరోయిన్స్ మెటీరియల్లో దర్శనమిస్తుంటారు. ఆ కోవకే వస్తుంది ఈ భామ. గ్యాంగ్ లీడర్ మూవీలో ఐదుగురు మహిళల్లో ఒకరిగా..సినిమా మొత్తం కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు.. కొన్ని సంవత్సరాలకు హీరోయిన్స్ మెటీరియల్లో దర్శనమిస్తుంటారు. ఆ కోవకే వస్తుంది ఈ భామ. గ్యాంగ్ లీడర్ మూవీలో ఐదుగురు మహిళల్లో ఒకరిగా..సినిమా మొత్తం కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

  • Published Dec 01, 2023 | 6:12 PMUpdated May 20, 2024 | 5:47 PM
నాని గ్యాంగ్ లీడర్‌లోని ఈ అమ్మాయిని.. ఇప్పుడు చూస్తే మతి పోవడం ఖాయం!

అమ్మాయిలు చూస్తుండగానే ఎదిగిపోతుంటారు. అది సామాన్యులైనా, సెలబ్రిటీలైనా.. చిన్నారి పెళ్లి కూతురు వంటి సీరియల్ రన్నింగ్ అవుతుండగానే.. అవికా గోర్ సినిమాల్లో హీరోయిన్‍గా ఎంటరై షాక్ ఇచ్చింది. ఆ పిల్ల, ఈ పిల్లేనా అని నివ్వెరపోయేలా చేసింది ప్రేక్షకులను. అలాగే కృతి శెట్టి కూడా అంతే.. అప్పటి వరకు వాణిజ్య ప్రకటనల్లో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇంటర్‌లో ఉండగానే.. యాక్ట్రస్ అవతారం ఎత్తి.. ఉప్పెన సినిమాలో హీరోయిన్ అయిపోయింది. ఇలాంటి నటీమణులు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి కూడా ప్రముఖ హీరో మూవీలో నటించి.. ఇప్పుడు అంతెత్తు ఎదిగిపోయింది. ఈ అమ్మాయి ఎవరంటే.. నాని గ్యాంగ్ లీడర్‌లో కనిపించింది కదా.. ఇంతకు అంత మంది గ్యాంగులో ఎవరనుకుంటున్నారా..?

ఈ గ్యాంగులో సీనియర్ నటీమణులు లక్ష్మీ, శరణ్య, హీరోయిన్ ప్రియాంక కాకుండా.. నాని చెల్లెలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు చాలా పెద్దదైదండోయ్. చూస్తుండగానే హీరోయిన్ మెటీరియల్‌గా మారిపోయింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. శ్రియా రెడ్డి కొంతం. ఆమె పక్కా హైదరాబాదీ. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి.. గ్యాంగ్ లీడర్ సినిమా మొత్తం కనిపిస్తుంది. ఈ మూవీ తర్వాత ఏ సినిమాల్లో కనిపించలేదు శ్రియా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, ఎలా ఉంది అని వెతికితే.. షాకింగ్ లుక్స్‌లో షేక్ చేసేస్తుంది. ఆ పిల్ల.. ఈ భామనే అని అనిపించకమానదు. ఇప్పుడు మరింత అందంగా  తన చూపులతో కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

ఈ అమ్మడు తన కట్టు బొట్టుతో, తన స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోజులు, ఫోటో షూట్స్ వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె బోస్టన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం సినిమాలకు దూరమైనట్లు సమాచారం. బోస్టన్ యూనివర్శిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆమె ప్రొఫెల్ ను బట్టి అర్థమౌతుంది. మరీ స్టడీస్ అయ్యాక.. సినిమాల వైపు వస్తుందో లేక.. ఇక చదువుకు తగ్గ ఉద్యోగంలో సెటిల్ అవుతుందో కాలమే నిర్ణయం చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె పిక్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ కంపల్సరీ. ఓ సారి ఆమె ఇన్ స్టా ఖాతాలోకి వెళ్లి చూస్తే.. అటు ట్రెడిషనల్, ఇటు పక్కా వెస్ట్రన్ కల్చర్ పిక్స్ లో పిచ్చెక్కిస్తోంది భామ.

 

View this post on Instagram

 

A post shared by Shriya Kontham (@shriya.kontham)

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş