iDreamPost

శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఈ పాప.. కాంట్రవర్సీ క్వీన్.. ఎవరో తెలుసా..?

మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు. వారిలో ఒకరు దిగ్గజ నటుడు, నడిగర తిలకం శివాజీ గణేశన్ అని తెలుస్తూనే ఉంది. మరీ అతడి చేతిలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టగలరా..? ఆ చిన్నారి ఎవరంటే..?

మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు. వారిలో ఒకరు దిగ్గజ నటుడు, నడిగర తిలకం శివాజీ గణేశన్ అని తెలుస్తూనే ఉంది. మరీ అతడి చేతిలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టగలరా..? ఆ చిన్నారి ఎవరంటే..?

శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఈ పాప..  కాంట్రవర్సీ క్వీన్.. ఎవరో తెలుసా..?

డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారో లేదో తెలియదు కానీ.. సినిమా యాక్టర్ చిల్డ్రన్ మాత్రం చిత్ర పరిశ్రమ వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచంలో ఫేమ్‌తో పాటు నేమ్, డబ్బు వస్తుంటాయి కాబట్టి. అందులోనూ వారసత్వంగా వచ్చిన నటనను వదిలి పెట్టాలని అనుకోరు. వారసుల పిల్లలు అయినా.. అవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేంత వరకు మాత్రమే. తర్వాత వాళ్లు ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఒక్కసారి క్లిక్ అయితే తిరుగుండదు. వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి ఆ కోవకే వస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా..? తమిళ దిగ్గజ నటుడు, నడిగర తిలకం శివాజీ గణేషన్ అని చెప్పేస్తారు.

కానీ శివాజీ గణేశన్ చేతిలో ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప ఎవరో గుర్తు పట్టగలరా..? క్లూ కూడా ఇస్తామండి. ఈమె తల్లిదండ్రులు ఫేమస్ నటీనటులు కూడా. అంతేనా ఈమె సోదరీ సోదరీమణులు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొనసాగుతున్నారు కూడా. అయినా గెస్ చేయలేకపోతున్నారా.. అయితే మరో క్లూ.. ఈమె కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. అయినా చెప్పలేకపోతున్నారా..? ఆమె ఎవరో కాదూ.. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ కుమార్, మంజుల తనయ వనితా విజయ్ కుమార్. దేవీ చిత్రంలో ముద్దుగా అందంగా కనిపించినా ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడో దేవీ మూవీ తర్వాత రీసెంట్‌గా మళ్లీ పెళ్లి చిత్రంలో మెరిసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఈమె తెలుగులో చేసినవి అడపాదడపా సినిమాలే అయినా.. తమిళంలో ఎక్కువ నటించింది. ప్రీతా, శ్రీదేవి ఆమెకు స్వయానా సోదరీమణులు.

This baby in the arms of Shivaji Ganesan is the queen of controversy who knows

ఇళయదళపతి విజయ్ సరసన చంద్రలేఖ అనే సినిమా చేసిన అమ్మడు.. చెప్పుకోదగ్గ మూవీస్ చేయలేదు. అయితే కుటుంబాలతో విభేదాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనను ఆస్తి కోసం ఇంట్లో నుండి తోసేశారని, తన తండ్రే తనను మోసం చేశాడంటూ ఆరోపించింది. అలాగే.. ఈమె మూడు పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అయ్యింది ఈ బొద్దుగుమ్మ. మూడో పెళ్లి అయితే మూణాళ్ల ముచ్చటగానే నిలిచింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని పట్టుమని ఆరు నెలలు కూడా కలిసి జీవించలేదు. వెంటనే అతడికి విడాకులు ఇచ్చేసింది. ఆమెకు ముగ్గురు ఆడ పిల్లలు.. జోవికా  తమిళ బిగ్ బాస్ రీసెంట్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన సంగతి విదితమే. ఇటీవల నటి వనితాపై దాడి కూడా జరిగిన సంగతి విదితమే. అలాగే ప్రముఖ నటుడు అరుణ్ విజయ్.. ఈమెకు సోదరుడు వరుస అవుతాడు. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. వనితా  విజయ్ కుమార్ పేరు చెప్పగానే.. మీకు ఏం గుర్తుకు వస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి