iDreamPost

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరులు!

ప్రజా బలం ఉంటే ఎక్కడ నుంచి పోటీ చేసిన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని కొంతమంది నాయకుల విషయంలో రుజువైంది. తెలంగాణలో వరుస విజయాలతో కొంతమంది నేతలతు దూసుకుపోతున్నారు.

ప్రజా బలం ఉంటే ఎక్కడ నుంచి పోటీ చేసిన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని కొంతమంది నాయకుల విషయంలో రుజువైంది. తెలంగాణలో వరుస విజయాలతో కొంతమంది నేతలతు దూసుకుపోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరులు!

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చట్టే నడుస్తున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన అనంతరం అన్ని పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా ఒకటీ రెండు తప్ప బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతున్న విషయం తెలిసిందే. 2023 లో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటి ముచ్చటా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు అధికార పార్టీ తెలంగాణను దోచుకున్నారు.. నిరుద్యోగులను మోసం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ సైతం అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్న నేతల గురించి తెలుసుకుందాం.

పార్టీ ఏదైనా.. ప్రజల నమ్మం, అభిమానం సంపాదిస్తే ఎప్పటికీ ఆదరిస్తారని ఎంతోమంది రాజకీయ నేతలు నిరూపించారు. తెలంగాణలో వరుస విజయాలు అందుకుంటూ వస్తున్న నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటెల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలంగాణ మంత్రిగా కొనసాగుతున్న టి. హరీష్ రావు.. సిద్దిపేటలో ఇప్పటి వరకు ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. మూడు ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆరుసార్లు విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిస్తే..ఏడోసారి గెలిచినట్లవుతుంది. ఇక బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట, కరీంనగర్ లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రమంత్రి అయిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆస్థానంలో హరీష్ రావు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004 నుంచి 2018 వరకు వరుస విజయాలు అందుకుంటూనే ఉన్నారు. 2008 ఉప ఎన్నికల్లో 58935 ఓట్ల మెజార్టీ, 2009 లో 64677 ఓట్ల మెజార్టీ, 2010లో ఉప ఎన్నికల్లో 95853 ఓట్ల మెజార్టీ, 2014లో 93328 ఓట్ల, 2018లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డిపై ఏకంగా 1,18,669 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

విదేశాల్లో ఐటీ ఉద్యోగంతో మంచి సంపాదన సంపాదిస్తున్న సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఆనాటి నుంచి తెలంగాణ ప్రజలతో మమేకమై వస్తున్న కేటీఆర్ తమ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు ఇక్కడి ప్రజలు. 2009 నుంచి కేటీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పట్లో తెలంగాణలో తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమి ఏర్పడటంతో కేవలం 10 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కే.కే. మహేందర్ రెడ్డి పై కేవలం 171 ఓట్లతో గెలిచారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన భారీ మెజార్టీతో గెలుస్తూ వచ్చారు. 2010లో ఉప ఎన్నికల్లో 68220 మెజార్టీ, 2014లో 53004 ఓట్ల మెజార్టీ, 2018లో ప్రత్యర్థిపై 89009 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు కేటీఆర్.

తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెంట తిరుగుతూ ముఖ్య అనుచరుడిగా మాజీ మంత్రి ఈటెల రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటి వరకు ఏడుసార్లు ప్రత్యర్థి అభ్యర్థులపై విజయఢంకా మోగిస్తూ వస్తున్నారను. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన కేసీఆర్ కేబినట్లో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. అలాగే అధికార పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పక్షాణ పోటీ చేసి గెలిచారు. మూడు సార్లు ఉప ఎన్నికల్లో గెలిచారు. 2004, 2008 లో జరిగిన ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ నియోజకవర్గం రద్దు కావడంతో హుజూరాబాద్ నుంచి 2009,2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు, 2014,2018, 2021 ఉప ఎన్నికలో మళ్లీ గెలుపు కైవసం చేసుకున్నారు. ఇలా ప్రజా బలంతో నేతలు వరుస విజయాలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి