iDreamPost

హైదరబాద్ లో ఈ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు

హైదరబాద్ లో ఈ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు

మార్చ్ 24 నుండి కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ ఎట్టకేలకు తెలంగాణలో ఆంక్షలతో కూడిన వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దేశ ప్రధాని నరేంద్ర మోడి లాక్ డౌన్ ని మరోసారి ఈ నెల31 వరకు పొడిగిస్తూ సడలింపు విషయాల్లో రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన అన్నీ జిల్లాలో యథావిధిగా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని రాష్ట్రంలో జిల్లాల మధ్య జిల్లాల లోపల బస్సులు నడుస్తాయని అయితే హైదరాబాద్ లో మాత్రం సిటీ బస్సులకు మెట్రో రైలు సర్వీసుకు అనుమతి లేదని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు తెరుచుకోవచ్చని మొత్తం సిబ్బంది విధుల్లోకి హాజరు కావచ్చని చెప్పుకొచ్చారు. ఆటోలకు టాక్సీలకు కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగరంలో మాత్రం సరి బేసి సంఖ్యలో దుకాణాలు తెరుచుకోవచ్చు అని దీనికి అనుగుణంగా విధి విధానాలు జీహెచ్ ఎంసీ కమీషనర్ ప్రకటిస్తారని, హైదరాబాద్ లో ప్రకటించిన కట్టడి ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి దుకాణాలు తెరవడానికి వీలు లేదని ఆయా ప్రాంతల్లో యథావిధిగా కఠిన ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న కట్టడి ప్రాంతాలు

నాంపల్లి
మల్లేపల్లి మసీదు, పాత ఆసీఫ్ నగర్ ప్రాంతాలు

గోషమహల్
కామటిపురా , ఝంగూర్ బస్తి, శివ్ లాల్ నగర్, సీతారాంభాగ్

చార్మినార్
తలాబ్ కట్ట, ఆమాన్ నగర్, షాగంజ్, మంజలీబేగం హవేలీ

యాకూత్ పురా
సంతోష్ నగర్, మాదన్న పేట

మలక్ పేట్
మలక్ పేట్ మార్కెట్, ప్రోఫెసర్ కాలనీ,

కార్వాన్
జియాగూడ, టప్పాచబుత్ర

రాజేంద్ర నగర్
అల్లాపూర్

ఎల్బీ నగర్
హుడా సాయి నగర్, సత్యనారాయణపురం , సాయినగర్, ఎస్.కే.డి నగర్, శ్రీరాం హిల్స్, విజయపురీ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, 3జేబీ కాలనీ, తిరుమల నగర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి