iDreamPost

ఇకపై వారికి ఆస్కార్ అవార్డులు రావు.. షాక్ లో దర్శక నిర్మాతలు..

ఇకపై వారికి ఆస్కార్ అవార్డులు రావు.. షాక్ లో దర్శక నిర్మాతలు..

ఇటీవలే ఘనంగా 94వ ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగాయి. అంతలోనే 95వ ఆస్కార్ అవార్డు వేడుకలకి కూడా డేట్ అనౌన్స్ చేశారు. ఈ అవార్డులకు అర్హత సాధించాలి అంటే కచ్చితంగా ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయాలి. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడి ఉంటటంతో చాలా వరకు హాలీవుడ్ సినిమాలు కూడా ఓటీటిలో రిలీజ్ అవ్వక తప్పలేదు.

ఈ రెండు సంవత్సరాల కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి కూడా ఆస్కార్ అవార్డులు ఇచ్చారు. దీని వల్ల థియేటర్లలో రిలీజ్ అవ్వలేని కొన్ని చిన్న సినిమాలకి కూడా ఆస్కార్ అవార్డులు వరించాయి. అయితే 95వ ఆస్కార్ అవార్డులకు ఎంట్రీలకు వచ్చే సినిమాలు కచ్చితంగా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు థియేటర్స్‌లో రిలీజ్‌ అయి ఉండాలి. కనీసం అమెరికా మెట్రోపాలిటిన్‌ ఏరియాలు అయిన లాస్‌ ఏంజిల్స్, న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటాల్లోని థియేటర్స్‌లో సినిమా కచ్చితంగా ప్రదర్శితమై ఉండాలి అనే కొత్త నిబంధనని మరలా ప్రవేశపెట్టింది.

కరోనా టైమ్‌లో అకాడమీ స్క్రీనింగ్‌ రూమ్‌లో మాత్రం సినిమాను ప్రదర్శిస్తే చాలు. కానీ ఇప్పుడు థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవ్వడంతో కచ్చితంగా ఆస్కార్ ఎంట్రీలు అయ్యే సినిమాలు థియేటర్స్ లో ప్రదర్శించాలని నిబంధన మళ్ళీ తెచ్చారు. దీంతో చిన్న సినిమాల దర్శక నిర్మాతలు షాక్ కి గురయ్యారు. ఈ నిర్ణయంతో థియేటర్లలో రిలీజ్ అవ్వలేని చిన్న సినిమాలకు ఆస్కార్ అవార్డులు వరించడం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి