iDreamPost

చైతు తగ్గాల్సిన అవసరం ఉండదు

చైతు తగ్గాల్సిన అవసరం ఉండదు

నిన్న సాయంత్రం టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, ఎగ్జిబిటర్లు పెట్టిన ప్రెస్ మీట్ ఇండస్ట్రీలో పెద్ద కలకలమే రేపింది. లవ్ స్టోరీని సెప్టెంబర్ 10 విడుదల ప్రకటించాక నాని సినిమాను ప్రైమ్ అదే రోజు ప్రీమియర్ చేయడం గురించి నిర్మాత సునీల్ నారంగ్ తో పాటు ఇతరులు కూడా గట్టి స్వరంలోనే నిరసన ప్రకటించారు. అయితే నిర్మాతలతో పాటు నానిని అదే పనిగా టార్గెట్ చేయడం పట్ల మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. విడుదల వ్యవహారం మాములుగా హీరోకు సంబంధం ఉండదు. నారప్ప, మాస్ట్రో విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్న సురేష్ బాబు, వెంకటేష్, నితిన్, సుధాకర్ రెడ్డిలను ఒక్క మాట అనకుండా కేవలం నానినే ఎందుకు నిందించడం అనేదే ప్రశ్న.

సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారం గురించి గట్టి చర్చలే జరుగుతున్నాయి. ఒకవేళ ప్రైమ్ కనక మాట వినకుండా టక్ జగదీష్ ని 10కే రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడు లవ్ స్టోరీని కొంత ఆలస్యంగా లేదా అంతకన్నా ముందు విడుదల చేసే ఆలోచనలో ఏషియన్ గ్రూప్ ఉన్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అధికారికంగా చెప్పలేదు కానీ దీని గురించిన విశ్లేషణయితే జరుగుతోందట. టక్ జగదీష్ కనక అదే రోజు ఓటిటిలో వస్తే ప్రేక్షకులు దాన్ని చూసి మళ్ళీ లవ్ స్టోరీ కోసం థియేటర్ల దాకా వస్తారా అనేదే ఆ యూనిట్ లో రేగుతున్న సందేహం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అలా చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది.

ఎందుకంటే లవ్ స్టోరీకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది. నాగ చైతన్య-సాయి పల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్ కావడంతో ప్రేమకథ అయినప్పటికీ అంచనాలు భారీగా ఉన్నాయి. మాములుగా బాక్సాఫీస్ వద్ద ఫేస్ టు ఫేస్ పోటీకే భయపడని నిర్మాతలు ఇప్పుడు ఓటిటి క్లాష్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అందులోనూ థియేటర్లు తెరిచిన ఇన్ని రోజులుకు కూడా భారీ క్రౌడ్ పుల్లర్ రాలేదు. రాజరాజ చోర బాగున్నప్పటికీ బిసి సెంటర్స్ లో ఏమంత గొప్పగా వెళ్లడం లేదు. అందుకే పండక్కు లవ్ స్టోరీ వస్తే హాళ్లు కళకళలాడతాయి. టక్ జగదీష్ ఇంట్లో ఎప్పుడైనా చూస్తారు. కానీ చైతు మూవీకి థియేటర్ మస్ట్ కాబట్టి ఇదే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చుగా

Also Read :  అంతకన్నా ఛాన్స్ లేదంటున్న జక్కన్న

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి