iDreamPost

వీడియో: బస్ నుంచి జారిపడిన నోట్ల కట్ట.. మహిళ చేసిన పనికి అంతా షాక్!

ప్రతి ఒక్కరికీ డబ్బుపై ఆశ ఉంటుంది. అయితే కొందరు కష్టపడి సంపాదించాలని భావిస్తుంటారు. మరికొందరు మాత్రం ఫ్రీగా రావాలని అనుకుంటారు. ఇలాంటి మైండ్ కలిగిన ఓ మహిళ బస్టాండ్ లో చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది.

ప్రతి ఒక్కరికీ డబ్బుపై ఆశ ఉంటుంది. అయితే కొందరు కష్టపడి సంపాదించాలని భావిస్తుంటారు. మరికొందరు మాత్రం ఫ్రీగా రావాలని అనుకుంటారు. ఇలాంటి మైండ్ కలిగిన ఓ మహిళ బస్టాండ్ లో చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది.

వీడియో: బస్ నుంచి జారిపడిన నోట్ల కట్ట.. మహిళ చేసిన పనికి అంతా షాక్!

భూమి మీద ఉండే ప్రతి మనిషికి డబ్బుపై ఆశ ఉంటుంది. ధనంపై వ్యామోహం లేని వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. ఇక రోడ్డుపైన డబ్బులను పారేసుకుంటే.. ఇక వాటి గురించి మర్చిపోవాల్సిందే. కారణం.. దొరికిన నోటును ఇచ్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కొందరు అయితే వేరే వాళ్ల విలువైన వస్తువులు పడిపోయేది చూసి కూడా.. కావాలని వాటిని పట్టుకుని పారిపోతుంటారు. ఇలా చేయడంలో ఎక్కువ మంది మగవాళ్లు ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ రేసులోకి ఆడవాళ్లు సైతం వచ్చి చేరుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పనికి  అందరూ షాకయ్యారు.

తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేటలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ  బస్టాండ్ లో ఉన్న ఓ బస్సు నుంచి లక్ష రూపాయలు జారిపడ్డాయి. అయితే అదే సమయంలో బయట ఉన్న ఓ మహిళ.. ఆ డబ్బుల కట్టను గమనించింది. దీంతో నోట్ల కట్ట బస్సు నుంచి జారిపడటమే ఆలస్యం.. తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. అలా లక్ష రూపాయల కట్టను పసుపు రంగు చీర కట్టుకున్న మహిళ తీసుకెళ్లడం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డబ్బులు తీసుకెళ్లిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వీడియోను పరిశీలించినట్లు అయితే.. బస్ లో నుంచి డబ్బులు కింద పడగానే.. అక్కడే ఎల్లో చీర కట్టుకున్న మహిళ..వెంటనే ఆ సంచిని తీసుకుంది. అంతేకాక రెప్పపాటులోనే అక్కడి నుంచి డబ్బులతో పరారైంది. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో దొరికిన డబ్బును బాధితులకు తిరిగించిన వారు కూడా ఉన్నారు. గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో సొమ్ముతో ఉన్న బ్యాగ్ రోడ్డుపై పడిపోయింది. ఈనేపథ్యంలో ఓ వ్యక్తికి కనిపించగా.. అది తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే సొమ్ము ఉంది. ఇలా తమకు దొరికిన  సొమ్మును తిరిగి ఇచ్చే వారు కొందరు ఉంటే.. పది రూపాయలు దొరికిన ఎత్తుకుపోయే జనాలు మరోవైపు ఉన్నారు.  ఇలా పరాయి సొమ్ము కోసం పాల్పడే వారిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం. మరి.. తాజాగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి