iDreamPost

ఇక ఇంటి సరుకులు తక్కువ ధరకే! మాల్స్ లో డబ్బులు తగలేసుకోకండి!

  • Published Apr 24, 2024 | 3:08 PMUpdated Apr 24, 2024 | 3:08 PM

ప్రస్తుత కాలంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన ఉత్పత్తులు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక నగరాల్లో అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రాండెడ్ పేర్లతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వేలకు వేలు పెట్టి ప్రజలు ఆ న్యాణమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ, అందులో ఎంత మాత్రం నాణ్యత కలిగివుండదు. కానీ, ఇకపై స్వచ్ఛమైన వస్తువులకు వేలకు వేలు ఖర్చు చేసే పని లేకుండా..నగరవాసులకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ అధికారులు ఓ గుడ్ న్యూస్ ను అందించారు.

ప్రస్తుత కాలంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన ఉత్పత్తులు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక నగరాల్లో అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రాండెడ్ పేర్లతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వేలకు వేలు పెట్టి ప్రజలు ఆ న్యాణమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ, అందులో ఎంత మాత్రం నాణ్యత కలిగివుండదు. కానీ, ఇకపై స్వచ్ఛమైన వస్తువులకు వేలకు వేలు ఖర్చు చేసే పని లేకుండా..నగరవాసులకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ అధికారులు ఓ గుడ్ న్యూస్ ను అందించారు.

  • Published Apr 24, 2024 | 3:08 PMUpdated Apr 24, 2024 | 3:08 PM
ఇక ఇంటి సరుకులు తక్కువ  ధరకే! మాల్స్ లో డబ్బులు తగలేసుకోకండి!

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ మేరకు ప్రజల జీవనశైలి కూడా మారుతోంది. దీంతో ఎవరు ఏ పని చేయాలనుకున్న సులువుగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కావలసిన నిత్యవసర సరుకులు దగ్గర నుంచి ఎలక్ట్రాకల్ వస్తువులు వరకు ఇలా అన్నిటికి పది దుకాణాలు తిరిగే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరికి ఏం కావల్సి వచ్చిన అందరూ మాల్స్, డిమార్ట్స్ అంటూ వెళ్లడం అలావాటుగా చేసుకున్నారు. అయితే మొదట్లో ఎక్కువ సంపాదన ఉన్న వాళ్లు మాత్రమే మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.అందరికీ ఇదో ఫ్యాషన్ గా మారిపోయింది. దీంతో మాల్స్ లో నాణ్యమైన వస్తువుల కోసం రకరకాల ఆఫర్స్ పేరిట ఆకర్షితులై వేలకు వేలు ఖర్చు చేయడం జరుగుతుంటుంది.కానీ, ఇకపై స్వచ్ఛమైన వస్తువులకు వేలకు వేలు ఖర్చు చేసే పని లేకుండా..నగరవాసులకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ అధికారులు ఓ గుడ్ న్యూస్ ను అందించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన ఉత్పత్తులు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక నగరాల్లో అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇక్కడ ఏ వస్తువు  కూడా స్వచ్ఛంగా దొరకదు. కానీ, బ్రాండెడ్ పేర్లతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వేలకు వేలు పెట్టి ప్రజలు ఆ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ, అందులో ఎంత మాత్రం నాణ్యత కలిగివుండదు. దీంతో సహజ సిద్ధంగా లభించిన ఉత్పత్తులు ఎలా ఉంటాయో కరువైన స్థితిలో నగరవాసులు ఉన్నారు. ఇక ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైన ఉత్పత్తులను అందించేందుకు  గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై షాపింగ్ మాల్స్ లో, డిమార్ట్స్ లో వేలకు వేలు తగలేసిన పని లేకుండా.. ప్రభుత్వం వారిచే తయారు చేస్తున్న  స్వచ్ఛమైన ఉత్పత్తులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే ఇకపై  ఈ ఉత్పత్తులను ప్రజలకు దగ్గర్లో ఉండే.. డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ ఔట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్స్ మేనేజ్మెంట్లతో మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ప్రస్తుతానికి  జీసీసీ ఆధ్వర్యంలో..  స్వచ్ఛమైన తేనె, షాంపూలు, సబ్బులు ప్రధానంగా అమ్ముతున్నారు. ఇక వాటిలో గిరి గోల్డ్ పేరుతో అలోవెరా, ఆరెంజ్, బొప్పాయి, పసుపు ఫ్లేవర్లో 4 రకాల్లో సబ్బులు ఉండగా..  కుంకుడుకాయలు, అలోవెరా షాంపూలు, టీఎస్ గిరిజన హనీ పేరుతో తేనెను విక్రయిస్తున్నారు. అయితే వీటిలో ఎటువంటి కెమికల్స్ వాడకపోవడమే కాకుండా.. అడవుల నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో ప్రజలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.

ఇక ఈ ఉత్పత్తులు అనేవి హైదరాబాద్ తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయి. అయితే వీటిని ఇప్పుడు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్లో సెక్రటేరియెట్ దగ్గర, మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసి వీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. కాగా, ఈ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. వీటిని డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ ఔట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్లలో దొరికేలా ఆయా యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించారు. అయితే ఆయా మాల్స్‌కు పర్మిషన్లు ఇచ్చే మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారుల సహాయం తీసుకోవాలని జీసీసీ అధికారులు డిసైడ్ అయ్యారు. ఇక  వారితో చర్చలు పూర్తవగానే, త్వరలోనే ఈ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి