iDreamPost

Movie: దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాల్ సలామ్ తెలుగు వెర్షన్

  • Published Feb 10, 2024 | 12:55 PMUpdated Feb 10, 2024 | 12:55 PM

రాజనీకాంత్ తాజాగా నటించిన లాలా సలాం సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటిరోజే తెచ్చుకున్న కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. అవి ఎంతంటే..

రాజనీకాంత్ తాజాగా నటించిన లాలా సలాం సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటిరోజే తెచ్చుకున్న కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. అవి ఎంతంటే..

  • Published Feb 10, 2024 | 12:55 PMUpdated Feb 10, 2024 | 12:55 PM
Movie: దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాల్ సలామ్ తెలుగు వెర్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం లాల్ సలాం తెలుగు వెర్షన్ కు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. రజినీకాంత్ ప్రెజెన్స్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సహాయ పడలేదు. నిజానికి ఈ సినిమాలో ఆయనది ప్రధాన పాత్ర కాకపోయినా చాలా మంచి స్క్రీన్ టైమ్ తో కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర సినిమా అంతటా ఉంది. కేవలం రెండు లేదా అయిదు నిమిషాల వరకు ఉండే అతిధి పాత్ర కాదు కాబట్టి ఇది రజినీకాంత్ సినిమా కాదనే ఫీలింగ్ ప్రేక్షకులకి కలగదు.

రజినీకాంత్ మంచి పాత్ర పోషించినా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించినా తెలుగు మార్కెట్ పై లాల్ సలామ్ చిత్ర బృందం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఆఫ్లైన్ ప్రమోషన్లు, కంటెంట్ ప్రమోషన్లు చాలా తక్కువ జరిగాయి. పాటలు సినిమా విడుదలకు ముందు తెలుగులో విడుదల కాలేదు. కేవలం ఒక రోజు ముందే ట్రైలర్, రెండు పాటలు విడుదల కాగా, లాల్ సలామ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజైన విషయమే చాలా మందికి తెలియదు. ఇక సినిమా విడుదలైన రోజు కూడా కంటెంట్ లో జాప్యం కారణంగా కొన్ని మార్నింగ్ షోలు రద్దు కావడంతో సినిమా చాలా స్టేషన్లలో సమస్యలను ఎదుర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్టేషన్లలో లాల్ సలామ్ సినిమాకు చాలా తక్కువ స్థాయిలో పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్ రోజే చాలా థియేటర్లు నష్టాలను చవిచూశాయి. లాల్ సలాం తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ డే షేర్ 20 లక్షల లోపే ఉందంటే ఎంత దారుణంగా ఓపెనింగ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

లాల్ సలాం తెలుగు వెర్షన్ ఒక ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. తమిళ వెర్షన్ కూడా పెద్ద ఓపెనింగ్స్ రాకపోయినా, డీసెంట్ రిపోర్ట్స్ తో మొదలయింది. మరి ముందు ముందు తమిళంలో సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బడ్జెట్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ పరిగణనలోకి తీసుకుంటే తమిళ ఓపెనింగ్స్ కూడా అంత సంతృప్తికరంగా లేవు. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయకపోవడం, జానర్ కూడా కమర్షియల్ కాకపోవడం సినిమా పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి