iDreamPost

కన్నతల్లికి నరకం చూపించిన కొడుకు.. మరి ఇంత దారుణమా..?

మనిషిలోని మానవత్వం నానాటికి కుంచించుకుపోతుంది. నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. కన్నతల్లిదండ్రులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు కడుపున పుట్టిన బిడ్డలు. ఆస్తి పాస్తులు రాయించుకుని నడిరోడ్డుపైకి ఈడ్చేస్తున్నారు.

మనిషిలోని మానవత్వం నానాటికి కుంచించుకుపోతుంది. నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. కన్నతల్లిదండ్రులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు కడుపున పుట్టిన బిడ్డలు. ఆస్తి పాస్తులు రాయించుకుని నడిరోడ్డుపైకి ఈడ్చేస్తున్నారు.

కన్నతల్లికి నరకం చూపించిన కొడుకు.. మరి ఇంత దారుణమా..?

తల్లికి కాన్పు అనేది రెండో జన్మ. తాను చనిపోయే అవకాశాలున్నాయని తెలిసినా.. తన కడుపులో పిండాన్ని మోస్తుంది. అమ్మా అనే పిలుపు కోసం పరితపిస్తూ ఉంటుంది. కడుపులో కాలితో తంతున్నా.. పంటి బిగువన నొప్పిని భరిస్తుంది. పురిటి నొప్పులు తట్టుకుని.. తన ప్రతి రూపాన్ని చూసేందుకు తహతహలాడుతూ ఉంటుంది. ముద్దులొలికే బుజ్జాయిని అరి చేతుల్లో పెట్టుకుని, కంటికి రెప్పలా కాచి కాపాడుతుంది. వారిని ప్రయోజకులను చేసేందుకు కష్టపడుతోంది. తండ్రి కోప్పడిన ప్రతిసారి.. పిల్లలకు అండగా తల్లి నిలుస్తుంది. వారు ఏ పని చేసినా వంత పాడుతుంది. కానీ రెక్కలొచ్చాక పిల్లలు.. తల్లిని, తండ్రిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతున్నారు.

ఈ తల్లికి ఎంత కష్టం వచ్చిందో. అత్యంత దయనీయ స్థితిలో మిర్యాల గూడలోని వాటర్ ట్యాంక్ తండా వద్ద ఓ వృద్దురాలి పడి ఉంది. నొప్పులతో విలవిలలాడుతోంది. అయితే గ్రామ సర్పంచ్ ధనావత్ రాంచంద్ నాయక్ ఈ వృద్దురాలిని చేరదీసి వివరాలు సేకరించగా.. ఆమెకు పిల్లలున్నారని తేలింది. కొడుకే ఆమెను దారుణంగా కొట్టి ఇలా పడేసినట్లు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండల ఎర్రావుల పాడుకు చెందిన చింతకాయల వెంకట రత్నమ్మకు భర్త ఏడు కొండలు, కుమారుడు వెంకటేశ్, కుమార్తె ఉన్నారు. భర్త లేకపోవడంతో కొడుకు దగ్గర ఉంది. ఆ సమయంలో కొడుకు, కోడలు ఆమెపై దాడి చేశారు. వృద్దురాలి చేతిని విరగొట్టారు.

అనంతర ఆమెను ఆటోలో వేసుకుని మిర్యాల గూడకు తీసుకు వచ్చి .. శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోయారు. మొక్కలకు నీరు పోసేందుకు గ్రామ పంచాయతీ స్టాఫ్ రావి వైకుంఠధామానికి వెళ్లగా.. అక్కడ ఎండలో పడి ఉన్న వృద్ధురాలిని చూసి.. విషయాన్ని గ్రామ సర్పంచ్ రామ చంద్ నాయక్ కు తెలియజేశాడు. దీంతో సర్పంచ్ అక్కడకు చేరుకుని ఆమెకు అల్పాహారం ఇచ్చి.. వివరాలు సేకరిస్తే.. ఆమె కొడుకు, కోడలు తనపై దాడి చేసి.. ఇక్కడ పడేసినట్లు చెప్పింది. అక్కడే కంపోస్టు షెడ్డు వద్ద ఆమె నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు సర్పంచ్. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మానవత్వం మరచి.. ఇలా కన్నతల్లిని నడి రోడ్డుపై వదిలేసిన ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి