iDreamPost

Viswambhara: విశ్వంభర విడుదల తేదీ ఖరారు

  • Published Feb 02, 2024 | 12:31 PMUpdated Feb 02, 2024 | 12:31 PM

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ లు అధిక ప్రాధాన్యం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందువల్లే ఈ సినిమా కేవలం మెగా అభిమానులకే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి

పద్మవిభూషణ్ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మెగా ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది. ఈ సినిమా యొక్క అప్డేట్స్ కోసం మెగా అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ ఉదయం చిత్ర బృందం విశ్వంభర సినిమా విడుదల తేదీ ఖరారు చేసింది.

ప్రస్తుతం కొత్త షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి ఈ వారంలో భాగం కానున్నారు. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. సంక్రాంతి సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడతాయి.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ లు అధిక ప్రాధాన్యం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందువల్లే ఈ సినిమా కేవలం మెగా అభిమానులకే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉందని, మృణాల్ ఠాకూర్, త్రిష, నయనతార, అనుష్కలు ఆయా పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. విశ్వంభర సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి