iDreamPost

భర్తలను చావ కొడుతున్న భార్యలు! తెలంగాణలోనే మరీ ఎక్కువగా!

ఇండియాలో భార్యా బాధితులు సంఖ్య పెరుగుతోందట.. అనేక కారణాలతో భర్తలను చావ కొడుతున్నారట భార్యలు. అయితే అచ్చ తెలుగు పదాహరాణాల మహిళలు సైతం.. ఇందులో తక్కువేమీ తినలేదట.

ఇండియాలో భార్యా బాధితులు సంఖ్య పెరుగుతోందట.. అనేక కారణాలతో భర్తలను చావ కొడుతున్నారట భార్యలు. అయితే అచ్చ తెలుగు పదాహరాణాల మహిళలు సైతం.. ఇందులో తక్కువేమీ తినలేదట.

భర్తలను చావ కొడుతున్న భార్యలు!  తెలంగాణలోనే మరీ ఎక్కువగా!

‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు.. భర్తగా మారకు బ్యాచిలరూ, షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు.. ఆలీకి మెళ్లో ముళ్లేసానని ఆనందించే మగవారూ.. ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారూ.. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్’ అని అప్పుడో చెప్పారు ప్రముఖ సినీ కవి సిరివెన్నెల. ఇప్పుడు అక్షర సత్యాలుగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో భార్యా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. భార్యల చేతుల్లో తన్నులు తింటున్న భర్తల సంఖ్య గతంతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యిందని ఓ సర్వే చెబుతోంది. భౌతిక దాడులకు గురౌతున్న వారిలో అమాయకులు, తాగుబోతులు, నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారని  తేలిందట.

పతిని దేవుడిగా పూజించే భారతదేశంలో భర్తలపై జరుగుతున్న దాడులపై బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ పరిశోధన చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన వివరాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది. ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్న మాటలను నిజం చేస్తూ.. వెయ్యి మంది మహిళల్లో 36 మంది భార్యలు.. తాళి కట్టిన మొగుడిపై చీపురు తిరగేస్తున్నారట. 15 సంవత్సరాల్లో పెనిమిటిపై సతి చేస్తున్న దాడులు ఐదింతలు రెట్టింపు అయినట్లు రీసెర్చ్‌ లో తేలింది. 2006లో ఆరుగురు మహిళలు మాత్రమే తమ భర్తలపై చేయి చేసుకుంటే.. ఇప్పుడు 36 మందికి పెరిగారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది.

ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండటంతో.. భర్తలు తమ గోడు వెలిబుచ్చుకోవాలంటే న్యాయ స్థానాలు కూడా వినడం లేదు. ఇక్కడ భార్య బాధితుల విషయంలో చట్టాలు చేయాలని, లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలని స్టడీ చెబుతుంది. ఇక పోతే తెలంగాణలో భార్యా బాధితులు ఎక్కువగా ఉన్నారట. కట్టుకున్నోడు కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుతుంటే.. అటువంటి భర్తలను ఉతికి ఆరేస్తున్నారట భార్యలు. ఈ లెక్కన ఇక్కడ భర్తలపై భార్యలు భౌతికంగా చేస్తున్న దాడులు  పెరిగాయి. తెలంగాణలో గత పదేళ్ల కాలంలో లిక్కర్ అమ్మకాలు పెరగడం.. గల్లీకొక మద్యం, కల్లు దుకాణం, లిక్కర్ షాపులు వెలియడంతో మందు బాబుల తాగుడుకు అడ్డు అదుపులేకుండా పోయింది. దీంతో తాగి ఇంటికి వెళ్లడంతో.. భార్యలు కోపంతో చావకొడుతున్నారు.

తాగుబోతుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ బాగుపడింది కానీ.. మద్యం తాగుతున్నందుకు ఓ కుటుంబం నాశనమౌతుంది. సమయం, సందర్భం లేకుండా ఒళ్లు, కుటుంబం మరిచి మద్యం తీసుకుంటున్న భర్తలపై భార్యలు గొడవకు దిగుతున్నారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారి.. హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. అలాగే తాగుడు మానేందుకు భర్తలను ఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లడం పరిష్కార మార్గమని చెబుతున్నారు వైద్యులు. మరి భర్తలను చావగొట్టే భార్యల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి