iDreamPost

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. పాత పాటలు వాడుకో.. హిట్ కొట్టుకో

మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఓల్డ్ క్లాసిక్స్ రీక్రియేషన్ కు చేస్తూ హిట్లను పట్టుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని సూపర్ హిట్ చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తాజాగా విడుదలైన యానిమల్ మూవీలో

మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఓల్డ్ క్లాసిక్స్ రీక్రియేషన్ కు చేస్తూ హిట్లను పట్టుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని సూపర్ హిట్ చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తాజాగా విడుదలైన యానిమల్ మూవీలో

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. పాత పాటలు వాడుకో.. హిట్ కొట్టుకో

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను ప్రస్తుతం విడుదల అవుతున్న చిత్రాలలోని సంగీతం నిరూపిస్తుంది. ఒక సినిమా విజయాన్ని సాధించాలంటే  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎంత ముఖ్యమో.. సంగీతం కూడా అంతే ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి తక్కువ అయినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు సంగీతం కాఫీలో చెక్కర లాంటిది. ప్రేక్షకులుగా మనం తెరపైన చిత్రాన్ని ఎలా గ్రహిస్తామో అనే విషయంలో సంగీతం ముఖ్య పాత్ర వహిస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలలో మనం ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ ను చాలానే వింటున్నాం. చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్లకు మంచి మెలోడీ క్లాసిక్స్ ను కొత్తగా పరిచయం చేస్తున్నట్లు ఉంది. మరి దర్శకులు పాత పాటలను రీక్రియేట్ చేయడంలో ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నారు!

నిజానికి సినిమా తీయడంలో మొదటిగా కథ ముఖ్యమైన పాత్రను పోషిస్తే.. ఆ తర్వాత డిమాండ్ చేసేది సంగీతం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికలో రాజీ పడరు దర్శక నిర్మాతలు. అయితే ఒకప్పుడు మనస్సును హత్తుకుపోయే సంగీతం ఉండేది. ఇప్పుడు బీట్స్ తప్ప మరే సౌండ్ వినపడం లేదు. అలాగే ఏ సాంగ్ చేసినా.. ఆ పాత పాటకు కాపీ అంటూ వంకలు పెడుతున్నారు.  ఎలాగూ కాపీ అని పేరొచ్చిందని ఏకంగా క్లాసిక్ హిట్ సాంగ్స్ ను అప్ గ్రేడ్ చేస్తూ.. న్యూ బీట్స్ తో రచ్చ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. కొత్త సీసాలో పాత సారాను అందించేందుకు సిద్ధమయ్యారు. అదేనండీ పాత పాటల్ని కాస్త కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రేండీ అయిపోయింది. అలా చేయడం వల్ల హిట్స్ కూడా రావడం కొసమెరుపు. ఇదే సక్సెస్ మంత్రగా మారింది.

ఓల్డ్ మెలోడీస్, రొమాంటిక్ సాంగ్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు తగినట్లు.. వాటిని అందిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన కొన్ని సూపర్ హిట్ చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రంలో.. హీరో రణ్ బీర్ ఎంట్రీ సీన్ కు.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన రోజా మూవీ సాంగ్స్ ను సింక్ చేశారు. దీనితో ఆడియన్స్ లో ఓ తెలియని ఉత్సాహం ఊపందుకుంది. ఇక బాబీ డియోల్ పరిచయానికి యూట్యూబ్ లో ఉన్న పాత అరబిక్ పాటను వాడుకున్నారు. అది ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంది. అలాగే హీరో విజయ్ నటించిన లియో చిత్రంలోనూ ఓ ఫైట్ సీన్ లో.. బాగ్రౌండ్ మ్యూజిక్ గా ఎప్పుడో ఇళయరాజా కంపోజిషన్ లో వచ్చిన దేవా సాంగ్స్ ను ప్లే చేశారు.

ఇక ఇటీవల విడుదలైన బాలయ్య చిత్రం ‘భగవంత్ కేసరి’ చిత్రంలోనూ.. హీరో బస్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఫైట్ సీన్ లో పాత ఎన్టీఆర్ పాటను హమ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఇటీవల విడుడుదలైన అన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలకు పాత సువాసనను జోడించి కొత్తగా కనబరిచారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడున్న దర్శకులకు పాత సినిమాల మీద ఉన్న  స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత్తం ఉన్న జనరేషన్ వాళ్ల ను ఆకట్టుకోవడం ఎంత ముఖ్యమో.. వారికి ఆసక్తి కలిగి విధంగా మన మూలలను పరిచయం చేయడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ రీక్రియషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి