iDreamPost

అఫీషియల్: OTTలోకి హనుమాన్.. డేట్ కూడా పక్కాగా ఫిక్స్!

  • Published Feb 17, 2024 | 5:07 PMUpdated Feb 21, 2024 | 11:21 AM

సంక్రాంతి కానుకగా హనుమాన్ చేసిన సందడి అంత ఇంతా కాదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి అడుగుపెడుతుందా అని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హనుమాన్ చిత్రం ఓటీటి ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

సంక్రాంతి కానుకగా హనుమాన్ చేసిన సందడి అంత ఇంతా కాదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి అడుగుపెడుతుందా అని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హనుమాన్ చిత్రం ఓటీటి ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

  • Published Feb 17, 2024 | 5:07 PMUpdated Feb 21, 2024 | 11:21 AM
అఫీషియల్:  OTTలోకి హనుమాన్.. డేట్ కూడా పక్కాగా ఫిక్స్!

తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ తో.. భారీ రేంజ్ లో ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతం “హనుమాన్”. ఈ చిత్రం కొన్ని చర్చల మధ్యన సంక్రాంతి కానుకగా .. ఎంతో నమ్మకంతో థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. అనుకున్నట్లు గానే పెద్ద హీరోల సినిమాల మధ్యన విడుదలయ్యి భారీ సంచనలం సృష్టించింది. సినిమా విడుదలైన స్పెషల్ షో నుంచే ఓ రేంజ్ టాక్ ను సంపాదించుకుంది ‘హనుమాన్’. ఇక ఆ తర్వాత దాదాపు ఇండస్ట్రీలో అందరి కళ్ళు హనుమాన్ చిత్రంపైన .. ఆ అద్భుతాన్ని సృష్టించిన ప్రశాంత్ వర్మ పైన ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. థియేటర్ లో ఈ సినిమా మిస్ వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఓటీటీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

అయితే, ఇప్పటికే హనుమాన్ తో పాటు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. కానీ, హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసే రాలేదు. దీనితో అభిమానులు, థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్ప్పటికీ కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇంకా హనుమాన్ చిత్రం త్వరలో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన మొదట్లో మూడు నుంచి నాలుగు వారాలలోనే ఓటీటీలో విడుదల చేయాలి అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను మడతపెట్టేయడంతో .. ఆ ఛాన్స్ రాలేదు.

ఇక ఇప్పుడు థియేటర్ లో టికెట్ ప్రైజ్ తగ్గించడంతో ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసేసారు మేకర్స్. ఈ క్రమంలో మార్చి రెండు నుంచి హనుమాన్ అన్ని భాషలలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఈ విషయంలో ఇంకా చిత్రబృందం నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికి హనుమాన్ మూవీ తో హైప్ లో ఉన్న ఆడియన్సు “జై హనుమాన్” చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి, థియేటర్ లో అందరికి పూనకాలు తెప్పించిన హనుమాన్.. ఇప్పుడు ఓటీటీ ఆడియన్సును కూడా అదే రేంజ్ ఆకట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పేయొచ్చు. మరి, హనుమాన్ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి