iDreamPost

The Kashmir Files : బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు

The Kashmir Files : బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు

దేశవ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్ సెన్సేషనల్ రన్ నమోదు చేస్తోంది. డ్రాప్ అయ్యే ట్రెండ్ కి విరుద్ధంగా సోమవారం ఏకంగా 16 కోట్లు రాబట్టడం ట్రేడ్ ని సైతం నివ్వెరపరిచింది. మల్టీ స్టారర్ సూర్యవంశీ కూడా నాలుగో రోజు దీనికన్నా తక్కువగా రాబట్టింది. తొలుత 600 స్క్రీన్లలో మొదలైన ఈ ప్రభంజనం ఇప్పుడు 3000కి దగ్గరలో ఉందని ట్రేడ్ రిపోర్ట్. అత్యధిక చోట్ల ఇవాళ కూడా హౌస్ ఫుల్ బోర్డులు కొనసాగుతున్నాయి. ఆన్ లైన్ అడ్వాన్స్ లోనే టికెట్లన్నీ అమ్ముడుపోతుండటం గమనార్హం. కరెంట్ బుకింగ్ దాకా జనాలు ఆగడం లేదు. కొన్ని నగరాల్లో కార్పొరేట్ సంస్థలు తమ కంపెనీ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్రీగా టికెట్లు స్పాన్సర్ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి.

నాలుగు రోజులకు గాను సుమారు 43 కోట్ల దాకా రాబట్టిన ది కాశ్మీర్ ఫైల్స్ మొత్తం రన్ ముగిసేలోపు 200 కోట్లు దాటుతుందనే అంచనా బలంగా ఉంది. ఇదిలా ఉంటె రాధే శ్యామ్ కు నిన్నటి నుంచి మొదలైన అగ్ని పరీక్ష డిజాస్టర్ వైపుకు తీసుకెళ్తోంది. ఇంత ల్యాగ్ ఉన్న ప్రేమకథ మాకొద్దని నార్త్ ఆడియన్స్ స్పష్టంగా తిరస్కరించారు. ప్రభాస్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు చేయడం లేదు కానీ తమన్, దర్శకుడు రాధాకృష్ణ బాధ్యత తమ భుజాల మీద వేసుకుని ఊరారా సక్సెస్ టూర్లు చుడుతున్నారు. దీని వల్ల అద్భుతాలేం జరగవు కానీ టార్గెట్ పెట్టుకున్న 200 కోట్లలో ఎంత నష్టం వస్తుందనేది ఊహకు అందటం లేదు. సగమైనా చేరడం అనుమానమే.

దీన్ని బట్టి ప్రేక్షకులు కంటెంట్ పట్ల ఎంత క్లారిటీతో ఉన్నారో అర్థమవుతోంది. సాహోతో పాఠం నేర్చుకోకుండా ఉత్తరాది మార్కెట్ గురించి ఏదేదో ఊహించుకుని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రాన జనం జాలి చూపించారని మరోసారి తెలిసింది. ప్రభాస్ ఇమేజ్ ఎంత గొప్పదైనా వీక్ కంటెంట్ ఉంటే తనైనా ఏమి చేయలేడని. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాశ్మీర్ ఫైల్స్ 200 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంటే, 300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకున్న రాధే శ్యామ్ ఇంకా 125 కోట్లు రాబట్టేందుకు యుద్ధం చేస్తోంది. ఇది ఎవరూ ఊహించనిది. ఇంకో తొమ్మిది రోజుల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తోంది కాబట్టి పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి

Also Read : SRK+ : డిజిటల్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి