iDreamPost

ఖాళీ అవుతున్న జనసేన పార్టీ.. పవన్ నిర్ణయాలే కారణమా?

ఖాళీ అవుతున్న జనసేన పార్టీ.. పవన్ నిర్ణయాలే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీ మధ్య అధికార మార్పిడి జరిగిదే. ఆ తరువాత కాంగ్రెస్ స్థానంలో వైఎస్సార్ సీపీ వచ్చింది. దీంతో అప్పటి నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు ఏపీ రాజకీయం సాగుతోంది. ఈ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, బలమైన నేతలు ఉన్నారు. అయితే  మూడవ పార్టీగా జనసేన వచ్చింది. పార్టీ ఏర్పడి చాలా ఏళ్లు అయినప్పటికి..ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఇటీవల ఎన్నికల సమీపించడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. ఆయన ఒకవైపు పర్యటనలు చేస్తుంటే మరోవైపు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. జనసేన పార్టీ ఖాళీ అవ్వడానికి  పవన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచారు. ఆ తరువాత చాలా కాలం పాటు రాజకీయాల్లో కనిపించలేదు. తిరిగి 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేసి.. ఒంటరిగా పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాలో ఓటమి పాలయ్యారు. రాజోల్ లో మాత్రం జనసేన అభ్యర్థి గెలిచారు. ఆ తరువాత చాలా కాలం పార్టీ కార్యాకలపాలు చాలా తక్కువగా సాగాయి. ఇలా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, రాజకీయ తీరు నచ్చకనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తరువాత కూడా రావెల కిషోర్ బాబు వంటి పలువురు నేతలు కూడా జనసేన నుంచి బయటకు వచ్చేశారు.

ఇక ఇటీవలే పవన్ కల్యాణ్ చేసిన పొత్తుల ప్రకటనతో చాలా మంది జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడిందని టాక్. అంతేకాక పార్టీ నేతలకు కూడా పవన్ తీసుకున్న నిర్ణయాన్నికి షాకయ్యారని తెలుస్తుంది. ఇప్పటి వరకు పవన్ ను సీఎం చేసేందుకు తాము కృషి చేస్తుంటే ఆయన పొత్తులతో ఎన్నికలకు వెళ్తే.. ఏం లాభం అంటూ జనసేన కార్యకర్తలే చర్చింకుంటున్నారు. ఇంకా జనసేన తరపున పోటీ చేయాలనుకు చాలా మంది.. ఈ పొత్తు కారణంగా టికెట్ కోల్పోవచ్చు. అంతేకాక పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలతో జనసేన నేతలు ఆయోమయానికి గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాసేపు ఎన్డీఏలో ఉన్నాను అంటారు, కాసేపు లేనూ అంటారు, అలానే కాసేపు తానే సీఎం అంటారు, మరికాసేపుటికి నేను సీఎం రేసులో లేను అంటారని.. ఇలా పవన్ కల్యాణ్ కి ఒక స్థిరమైన ఆలోచన లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈక్రమంలోనే పవన్ తో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని భావించి.. చాలా మంది నేతలు ఎన్నికలకు ముందే పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నిన్నగా మొన్న పిఠాపురం ఇన్ ఛార్జీ మాకినీడి శేషు కుమారి రాజీనామా చేశారు. అంతకముందు ప్రముఖ లాయర్ కల్యాణ్ దీలీప్ సుంకర్ కూడా జనసేన పార్టీని వీడారు. తాజాగా నెల్లూరు సిటీ కి చెందిన జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇలా పార్టీకి రాజీనామా చేసిన వాళ్లందరూ అక్కడ కీలకమైన వారే. భవిష్యత్తులో మరింత మంది బయటకు వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికి పవన్ నిర్ణయాలే కారణమని, భవిష్యత్తులో జనసేన పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. పవన్ పాలిటిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి