iDreamPost

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం!

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం!

రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. తాజాగా ఏఐ చాట్ బాట్ ను కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ.. ఏఐ చాట్ బాట్ ద్వారా పీఎం కిసాన్ రైతులు మరిన్ని వివరాలు సులభంగా పొందే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇంతే కాకుండా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో తెలుసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.

అప్లికేషన్ స్టేటస్, దరఖాస్తు ప్రక్రియ, పేమెంట్ స్టేటస్, లబ్ధిదారుల జాబితా వంటి వివరాలు పొందే వీలు అంటుందని ఆయన తెలిపారు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా తీసుకొచ్చామని ఆయన అన్నారు. మరో విషయం ఏంటంటే? దేశంలోని అనేక ప్రాంతీయ భాషల్లో ఏఐ ఛాట్ బాట్ సర్వీసులను పొందేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించామని మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు మరో శుభవార్తను చెప్పారు. త్వరలో పీఎం కిసాన్ నగదును సైతం రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లుగా కూడా తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ప్రతీ ఏడాది ఎకరాకు రూ.2 వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి