iDreamPost

వీడియో: తాళి కట్టే సమయానికి వరుడికి షాకిచ్చిన వధువు! 

సరిగ్గా తాళికట్టే సమయానికి పెళ్లి పీటల మీదే వధువు వరుడికి షాకిచ్చింది. ఈమె చేసిన పనికి అందరూ షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందంటే?

సరిగ్గా తాళికట్టే సమయానికి పెళ్లి పీటల మీదే వధువు వరుడికి షాకిచ్చింది. ఈమె చేసిన పనికి అందరూ షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందంటే?

వీడియో: తాళి కట్టే సమయానికి వరుడికి షాకిచ్చిన వధువు! 

అది డిసెంబర్ 7 గురువారం ఉదయం 11 గంటల సమయం. ఓ యువతిని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇరువురి పెద్దలు గతంలోనే నిర్ణయించారు. పెళ్లి రోజు కావడంతో వరుడు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండపంలో బంధువులు అందరూ వచ్చి రెడీగా కూర్చున్నారు. బ్యాండ్ మేళాలతో మండపం అంతా సందడిగా మారింది. ఇక తాళి కట్టే సమయం కూడా రానే వచ్చింది. ఇదే టైమ్ లో వరుడు తాళి కడుతుండగానే వధువు ఊహించని షాకిచ్చింది. ఈసీన్ చూసి పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇది కలనా నిజమా అన్నట్లుగా చూశారు. వధువు ఇచ్చిన దెబ్బకు వరుడికి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు పెళ్లి కూతురు ఏం చేసిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని చిక్కబ్యాలడకెరెకు చెందిన మంజునాథ్ కు, ఐశ్వర్య అనే యువతికి గత 6 నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇటీవల డిసెంబర్ 7న వివాహం కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపానికి వధువు, వరుడు బంధువులందరూ వచ్చారు. బ్యాండ్ మేళాలతో మండపం అంతా సందడిగా మారింది. అయితే, వరుడు తాళి కట్టే సమయానికి వధువు ఊహించని దెబ్బ కొట్టింది. నాకు ఈ ఇష్టం పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది. దీంతో వరుడు మంజునాథ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు ఐశ్వర్యను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతి అస్సలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆ తర్వాత వధువు ఐశ్వర్య అసలు నిజాలను బయటపెట్టింది. నేను గతంలో ఓ యువకుడిని ప్రేమించానని, నాకు ఇష్టం లేకుండా మా తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారని తెలిపింది. దీంతో ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వరుడు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? వధువు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో పెళ్లి ఖర్చు మొత్తం వరుడే భరించాడట. దీంతో పోలీసులు వధువు పెళ్లికి నిరాకరించడంతో పెళ్లి ఖర్చును వధువు కుటుంబ సభ్యులు వరుడికి చెల్లించాల్సిందేనంటూ సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాళి కట్టే సమయానికి పెళ్లికి నిరాకరించి వరుడికి కోలుకోలేని షాకిచ్చిన వధువు ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి