iDreamPost

8 ఏళ్ల తర్వాత నేరుగా ఓటీటీకి వస్తున్న తమన్నా సినిమా!

ప్రశాంత్‌ వర్మ 2104లో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్లకు షూటింగ్‌ పూర్తయింది. అయితే, అనుకోని కారణాల వల్ల మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ప్రశాంత్‌ వర్మ 2104లో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్లకు షూటింగ్‌ పూర్తయింది. అయితే, అనుకోని కారణాల వల్ల మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

8 ఏళ్ల తర్వాత నేరుగా ఓటీటీకి వస్తున్న తమన్నా సినిమా!

‘‘ హనుమాన్‌ ’’ మూవీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ- మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ‘‘ దటీజ్‌ మహాలక్ష్మి’’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2014 సంవత్సరంలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయింది. 2016లో చిత్ర షూటింగ్‌ పూర్తి అయింది. అయితే, విడుదల నేపథ్యంలో అనుకోని వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా హిందీలో తెరకెక్కిన ‘క్వీన్‌’కు రీమేక్‌గా వచ్చింది. క్వీన్‌ సౌత్‌ రీమేక్‌ విషయంలో కొన్ని వివాదాలు తలెత్తాయి.

ఈ వివాదాల కారణంగా ‘దటీజ్‌ మహాలక్ష్మి’ మూవీ విడుదల పోస్టు పోన్‌ అవుతూ వచ్చింది. అసలు ఈ సినిమా విడుదల అయిందా?లేదా? అన్న సంగతి ప్రేక్షకులకు కూడా గుర్తులేదు. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం షూటింగ్‌ పూర్తయిన ఎనిమిదేళ్ల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. థియేటర్‌లో విడుదల చేయటం వల్ల లాభం ఉండదని వారు భావిస్తున్నారట.

tamanna movie release in ott after 8 years

ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయట. స్ట్రీమింగ్‌ డేట్‌ గురించి త్వరలో డేట్‌ ఖరారు కానుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించగా.. షిబానీ దండేకర్‌, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటించారు. అమిత్‌ త్రివేది, అర్జున హర్‌జ్వాల్‌లు సంగీతం అందించారు. మీడియెంటే ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్స్‌ లిమిటెడ్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కాగా, ప్రశాంత్‌ వర్మ తాజా చిత్రం హనుమాన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది. అయితే, సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. వాటికి హనుమాన్‌ పోటీగా ఉండటంతో.. కుట్రలు మొదలయ్యాయని ప్రశాంత్‌ వర్మ చెప్పారు. మూవీని ఆపడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయినప్పటికి తాను వెనక్కు తగ్గనని తేల్చి చెప్పారు.

చెప్పిన సమయానికి సినిమా విడుదల చేసి తీరతానన్నారు. ఇండస్ట్రీలో మంచి వారు కూడా ఉన్నారని తెలిపారు. సంక్రాంతికి తన సినిమా రవితేజ సినిమా ఈగల్‌కు పోటీగా వస్తున్నా.. ఆయన మాత్రం హనుమాన్‌ కోసం సాయం చేశారని తెలిపారు. హనుమాన్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి, షూటింగ్‌ పూర్తయిన ఎనిమిది ఏళ్ల తర్వాత దటీజ్‌ మహాలక్ష్మి సినిమా ఓటీటీలో విడుదల అవ్వనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి