iDreamPost

యూనిక్ డైరెక్టర్.. నటుడిగా మారి ఐదేళ్లు వృధా చేశాడా?

  • Author ajaykrishna Updated - 04:22 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:22 PM, Sat - 16 September 23
యూనిక్ డైరెక్టర్.. నటుడిగా మారి ఐదేళ్లు వృధా చేశాడా?

ఇండస్ట్రీలో యూనిక్ సినిమాలు తీసే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తరుణ్ భాస్కర్. ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. రెండు సూపర్ హిట్. 2016లో పెళ్లి చూపులు, 2018లో ఈ నగరానికి ఏమైంది.. ఈ రెండు కూడా యూనిక్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాయి. ఈ సినిమాలతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ రైటింగ్ స్టైల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ.. ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత.. తరుణ్ నుండి ఇప్పటిదాకా ఏ ఒక్క సినిమా తెరపైకి రాలేదు. అంటే.. నటుడిగా అవతారం ఎత్తి.. డైరెక్షన్ ని పక్కన పెట్టేశాడు. 2018లో మహానటి సినిమాతో నటుడిగా మారాడు తరుణ్ భాస్కర్.

ఆ తర్వాత నుండి ఇప్పటివరకు దాదాపు పది సినిమాలకు పైగా నటించాడు. అందులో మీకు మాత్రమే చెప్తా అనే మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు. మిగతా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. కానీ.. మధ్యమధ్యలో రైటింగ్ పరంగా వేరే సినిమాలలో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. తన సొంత సినిమాలు కాకుండా తరుణ్ భాస్కర్.. పిట్టకథలు, మీకు మాత్రమే చెప్తా, ఒకే ఒక జీవితం, ఓరి దేవుడా సినిమాలకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేశాడు. ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తన సొంత ప్రాజెక్ట్ ‘కీడా కోలా’ని ప్రకటించాడు. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రాబోతుంది.

తాజాగా కీడా కోలా మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నవంబర్ 3న కీడా కోలా.. థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అయితే.. పెళ్లి చూపులు మూవీకి బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది మూవీకి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్.. ప్రశంసలు లభించాయి. ఈ రెండు సినిమాల ఫలితాలు చూసి.. ఇండస్ట్రీకి ఓ యూనిక్ డైరెక్టర్ దొరికేసాడని అందరు అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా తరుణ్ నుండి ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా రాలేదు. వేరే సినిమాలకు రైటింగ్ వర్క్ చేసినా.. ఆయా దర్శకుల స్క్రిప్ట్ పరంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకే.. సొంత స్క్రిప్ట్ వాల్యూ వేరు ఉంటుంది. తరుణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ బట్టి.. ఓ రకంగా ఐదేళ్లలో ఒక్క సినిమా తీయకుండా టైమ్ వేస్ట్ చేశాడని అంటున్నాయి సినీ వర్గాలు. మరి తరుణ్ భాస్కర్ మూవీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి