iDreamPost

రామ్ చరణ్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది.. గట్టిగా ప్లాన్ చేశారుగా..!

  • Author singhj Published - 12:21 PM, Thu - 17 August 23
  • Author singhj Published - 12:21 PM, Thu - 17 August 23
రామ్ చరణ్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది.. గట్టిగా ప్లాన్ చేశారుగా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ కెరీర్​లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి ‘ధృవ’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి హిట్​గా నిలిచింది. ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్​ లీ: ది ఫైటర్’ లాంటి వరుస ఫ్లాపులతో రేసులో కాస్త వెనుకబడిన టైమ్​లో చెర్రీ కెరీర్​కు మంచి బూస్టప్ ఇచ్చింది ‘ధృవ’. అయితే ఈ మూవీ ఓ తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. కోలీవుడ్​లో స్టార్ డైరెక్టర్​గా పేరు గడించిన మోహన్​ రాజా రూపొందించిన ‘తని ఒరువన్​’కు అఫీషియల్ రీమేకే ‘ధృవ’. ఈ మూవీలో చరణ్​ను చూపించిన విధానానికి ఆయన ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు.

‘ధృవ’కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని రామ్ చరణ్​ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా అభిమానుల కోసం ఒక శుభవార్త వచ్చేసింది. ఈ మూవీకి ఒరిజినల్ అయిన ‘తని ఒరువన్’ సీక్వెల్​కు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత శ్రీకారం చుట్టనున్నారు. 2015 ఆగస్టు 28న ఈ చిత్రం విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో ‘తని ఒరువన్’ వచ్చి 8 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అదే రోజున ‘తని ఒరువన్ 2’ ప్రాజెక్ట్​కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానుందని టాక్. ఈ మూవీ గురించి ఇప్పటికే దర్శకుడు మోహన్​ రాజా క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్​ చిరంజీవితో తీసిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం ప్రమోషన్స్ సమయంలో ‘తని ఒరువన్’ సీక్వెల్ గురించి మోహన్ రాజా మాట్లాడారు.

‘తని ఒరువన్’ సీక్వెల్​కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావొచ్చాయని, త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అప్పట్లో మోహన్ రాజా అన్నారు. ఈ స్టోరీ లైన్ రామ్ చరణ్​కు కూడా బాగా నచ్చిందన్నారు. అయితే తెలుగులో ‘ధృవ 2’ ఉంటుందో లేదా రాబోయే రోజుల్లోనే తెలుస్తుందని సందిగ్ధంలో పడేశారు మోహన్​ రాజా. ఒకవేళ ‘తని ఒరువన్ 2’ సూపర్ హిట్టయితే తెలుగులోనూ సీక్వెల్ తెరకెక్కొచ్చు. మొత్తానికి పట్టాలెక్కడానికి ముందే ‘తని ఒరువన్ 2’పై అటు కోలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ ఆసక్తి నెలకొంది. మరి.. ‘ధృవ 2’ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aakashavaani (@theaakashavaani)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి