iDreamPost

Radhe Shyam : బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం భారీ ప్లాను

Radhe Shyam : బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం భారీ ప్లాను

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ టాప్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఇప్పుడు మాములు బిజీగా లేడు. గత ఏడాది అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అసలు ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఆఫర్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఏ స్టార్ హీరో ప్రాజెక్ట్ చూసుకున్నా అక్కడ తమన్ పేరే ఉంటుంది. ఇటీవలే అఖండ విజయంలో తన పనితనం గురించి నేషనల్ మీడియాలో సైతం ప్రసంశలు దక్కిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, చిరంజీవి గాడ్ ఫాదర్, చరణ్-శంకర్ ల సినిమా, బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తమన్ మీద మరో పెద్ద బాధ్యత పడనుందని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. పాటలు కంపోజ్ చేసింది జస్టిన్ ప్రభాకరే అయినప్పటికీ ఇంత పెద్ద సెటప్ ఉన్న మూవీ బిజిఎంకి న్యాయం చేకూర్చగలరో లేదోననే అనుమానం నిర్మాతల్లో ఉందట. అందుకే అన్ని వెర్షన్లకు తమన్నే తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రభాస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. కాకపోతే అఫీషియల్ చేసే దాకా ఖరారుగా చెప్పలేం. ప్రస్తుతమైతే చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

రాధే శ్యామ్ ట్రైలర్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరే వినిపిస్తుండటంతో రాధే శ్యామ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వస్తోంది. జనవరిలో రెండు సినిమాల మధ్య వారం రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ పోటీ పరంగా ఉన్న ఇబ్బంది తొలగిపోదు. పైగా క్లాస్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్న రాధే శ్యామ్ తో పోల్చుకుంటే ఆర్ఆర్ఆర్ కు చాలా అంశాలు ఎక్కువ పాజిటివ్ గా ఉన్నాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తమన్ ని ఛాయస్ గా పెట్టుకోబోతున్నట్టు చెబుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జయరాం, భాగ్యశ్రీ తదితరులు ఇతర కీలక తారాగణం. ట్రైలర్ డేట్ ఇవాళో రేపో వచ్చేస్తుంది

Also Read : Miss Universe 2021 : 21 ఏళ్ళ నిరీక్షణకు బ్రేకులేసిన పంజాబీ భామ.. మిస్ యూనివర్స్ 2021గా అవతరణ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి